సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వరకు ఫ్యామిలీ హీరోలుగా బాగా గుర్తింపు పొందారు. అయితే తెలుగు లో మాత్రం ఎక్కువగా ఫ్యామిలీ హీరోగా ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ ల తర్వాత  శోభన్ బాబు,జగపతి లాంటి హీరోలు ముఖ్యంగా ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా అద్భుతమైన నటన కనబరిచారు.  తోలి లవర్ బాయ్ గా, రొమాంటిక్ హీరోగా, మొట్టమొదటి డ్యాన్సింగ్ హీరోగా అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో అందరి మన్ననలు బాగా పొందారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే కేవలం సాంఘిక చిత్రాలకే పరిమితం కాకుండా పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులచే మెప్పు పొందారు.

వీరి తర్వాత శోభన్ బాబు, కృష్ణ హవా కొనసాగినా శోభన్ బాబు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఇక కృష్ణ ఎక్కవగా యాక్షన్ చిత్రాలకు పెద్దపీట వేయడం జరిగింది. వీరి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోలు అంటే జగపతి బాబు, శ్రీకాంత్ అనే చెప్పొచ్చు..ఫ్యామిలీ ఆడియన్స్ కి వీరు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం వీరు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు..జగపతి బాబు ఇప్పటికే నెగిటీవ్ వేయగా శ్రీకాంత్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. 


సీనియర్ ఎన్టీఆర్ 


విశ్వ విఖ్యాత నట సార్వబౌమ నందమూరి తారక రామారావు గారు 1949 లో 'మన దేశం' సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యి 100 సినిమాలు పూర్తి చేసి అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. \


ఏఎన్ఆర్


అక్కినేని నాగేశ్వరరావు 1941 లో 'ధర్మపత్ని' సినిమా ద్వారా పరిచయం అయ్యి 230 సినిమాలకు పైగా నటించాడు. అప్పట్లో తాగుబోతు యాక్షన్ చేయాలంటే ఒక్కనాగేశ్వరరావు తర్వాత అనేవారు ఆయన నటించిన దేవదాసు, ప్రేమనగర్ చిత్రాలు ఎప్పటికీ మరువలేని విధంగా నిలిచిపోయాయి.


శోభన్ బాబు


మహిళ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న శోభన్ బాబు 1959 లో వచ్చిన 'దైవ బలం' సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యి 100 కి పైగా సినిమాల్లో నటించాడు. చిత్ర రంగంలో ఉన్నంత వరకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న వ్యక్తిగా అందరి మన్ననలు పొందారు.


జగపతి బాబు


సినిమా ఇండస్ట్రీలో వారసత్వపు హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు జగపతి బాబు.  నిర్మాత, దర్శకులు వి.వి. రాజేంద్రప్రసాద్ తనయుడైన జగపతి బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో మంచి గుర్తింపు సంపాదించి తర్వాత ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి నెగిటీవ్ పాత్రలు వేస్తున్నారు.  


శ్రీకాంత్


ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్టపడే మరో కథానాయకుడు శ్రీకాంత్. మొదట్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చినా తర్వాత కామెడీ, ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం బాబాయ్ పాత్రల్లో నటిస్తున్న శ్రీకాంత్ త్వరాలో విలన్ గా కూడా కనిపించబోతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: