ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ మూవీ నుండి దర్శకుడు ఎస్.జె. సూర్య తప్పుకున్నా అతడి మనసు మాత్రం ఇప్పటికీ ఆ సినిమా ప్రాజెక్ట్ పైనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈసినిమాకు సూర్య స్థానంలో డాలీ వచ్చి చేరినా సూర్య మాత్రం ఈసినిమాకు సంబంధించి లీక్స్ ఇస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా ఒక కోలీవుడ్ మీడియా సంస్థకు సూర్యా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ లేటెస్ట్ సినిమా గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలను బయట పెట్టినట్లుగా తెలుస్తోంది. 

పవన్ చేయబోతున్న లేటెస్ట్ సినిమా బడ్జెట్ వంద కోట్లు అని సూర్య చెపుతున్నాడు. ఈ సినిమా అంతా ప‌వ‌న్ పంచె క‌ట్టులోనే క‌నిపిస్తాడ‌ట‌. అంతేకాదు ఈసినిమాలోని పవన్ పాత్ర ‘క్షత్రియ పుత్రుడు’ సినిమాలోని కమలహాసన్ పాత్రలా పవన్ పంచె కట్టుతో కనిపిస్తాడని సూర్య లీకులు ఇస్తున్నాడు. అంతేకాదు రాయలసీమ నేపధ్యంలో సాగే ఈసినిమాలో ఒక ఫ్యాక్షనిస్ట్ ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా మూల కథ అని సూర్య లీకులు ఇస్తున్నాడు. 

అంతేకాదు తన కెరియర్ లో తాను ఇటువంటి సినిమాను చేస్తానని కలలో కూడ అనుకోలేదని అయితే అనుకోకుండా మురగదాస్ దర్శకత్వంలో మహేష్ కు విలన్ గా మారే చాన్స్ రావడంతో విపరీతమైన బాధతో తాను పవన్ సినిమాను వదులుకున్నాను అని అంటున్నాడు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కు పెరిగి పోయిన పాపులారిటీతో పవన్ ను హ్యాండిల్ చేయడం చాల కష్టం అని పవన్ తో సినిమా చేసే దర్శకుడుకి విపరీతమైన టెన్షన్ పెరిగి పోతుంది అని సంచలన వ్యాఖ్యలు చేసాడు సూర్య.

పవన్ తనను ఒక సోదరుడు లా భావిస్తాడని మహేష్ బాబు సినిమాలో తాను విలన్ గా చేయబోతున్న విషయం చెప్పగానే తనను ఆప్యాయంగా హగ్ చేసుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ పవన్ లాంటి జెన్యూన్ వ్య‌క్తిని తాను ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చూడలేదు అంటూ పవన్ ని ఆకాశానికి ఎత్తేశాడు సూర్య.  గతంలో తాను తీసిన ‘కొమరం పులి’ ఫ్లాపైనా ఆ సినిమా విష‌యంలో త‌న క‌ష్టాన్ని పవన్ గుర్తించాడు అంటూ పవన్ పై ప్రశంసలు కురిపించిన సూర్య తాను పవన్ సినిమా నుండి ఎందుకు తప్పుకున్నాడు అన్న విషయాన్ని క్లారిటీ ఇవ్వడానికి పవన్ గురించి ఇన్ని విషయాలు సూర్య చెప్పుకోచ్చాడనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: