ప్రపంచంలో ఉగ్రవాదుల దాడులు రోజు రోజుకీ పెచ్చుమీరుతున్న సందర్భంలో నిన్న రాత్రి టర్కీ లో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు ఐస్ తీవ్రవాదులు విచక్షణా రహితంగా పౌరులను కాల్చివేస్తూ..వచ్చారు.  అయితే ఇంతలో పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో ఆత్మాహుతి బాంబర్లుగా మారిపోయి తమను తామే పేల్చేసుకున్నారు. ఆ ధాటికి 36 మంది అక్కడికక్కేడే మృతి చెందగా 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ తెల్లవారుజామున జరిగిన ఆత్మాహుతి దాడితో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అరుపులు, కేకలు, తుపాకి గుళ్లతో దద్దరిల్లిపోయింది.  తాజాగా ఈ ఆత్మాహుతి దాడిలో ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఆయన కుమారులు ప్రాణాలతో బతికి బయట పడ్డారు.
tur
 టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో నుంచి హృతిక్ రోషన్ ఇండియాకు బయల్దేరిన కొద్దిసేపటిలోనే అక్కడ ఆత్మాహుతి దాడి జరిగింది. అయితే తమ క్షేమ సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు హృతిక్ రోషన్. గతంలో కూడా ఇలాంటి బాంబు దాడులు జరిగినపుడు కొంతమంది సెలబ్రెటీలు ప్రాణాలతో తప్పించుకున్నారు.  ఈ సందర్భంగా తాము ఎంతో అదృష్టవంతులమని తమ క్షేమ సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు హృతిక్ రోషన్. అయితే ఉగ్రదాడి జరిగిందని తెలిసిన తర్వాత చాలా షాక్‌కు గురయ్యానని అన్నాడు.

బిజినెస్ క్లాస్ టికెట్లు దొరక్కపోవడంతో అంతకుముందే ప్రయాణించాల్సిన విమానం మిస్ అయ్యిందని, అయితే అక్కడి అధికారుల సహాయం వల్ల ఎకానమీ ఫ్లైట్ ద్వారా ఇండియాకు క్షేమంగా బయల్దేరగలిగామని హృతిక్ వివరించాడు. ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మశాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 

హృతిక్ రోషన్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: