విలక్షణ దర్శకుడు క్రిష్ ను చూసి ఇప్పటికైనా ప్రభాస్ నేర్చుకుంటే  బాగుంటుంది అంటూ కొంతమంది ప్రభాస్ అభిమానులు తమలో తాము కామెంట్ చేసుకుంటున్నట్లు టాక్. ప్రభాస్ అభిమానులు ఇలా భావించడానికి ఒక కారణం ఉంది అని ప్రచారం జరుగుతోంది. 

భారీ బడ్జెట్ తో బాలకృష్ణ 100వ సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను తీస్తూ ఒక్క నిమిషం కూడ ఖాళీ లేకుండా ఈసినిమాకు సంబంధించి 24 విభాగాల్ని క్రిష్ సమన్వయం చేసుకుంటున్న విషయం తెలిసిందే. సంక్రాంతి రేస్ కు  బాలయ్య 100వ సినిమాను సిద్ధం చేస్తూ కూడ ఈ సినిమా హడావిడిల మధ్య క్రిష్ పెళ్ళి చేసుకోవడం ప్రభాస్ అభిమానులను ఆశ్చర్య పరుస్తున్నట్లు టాక్.  

గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్టులకు చాలా ప్రాధాన్యత ఉండే భారీ సినిమాను చేస్తూ పెళ్ళి చేసుకోవడానికి  ఖాళీ ఉన్న క్రిష్ మాదిరిగా ‘బాహుబలి’ సినిమాను చేస్తున్న ప్రభాస్ కు పెళ్ళి చేసుకోవడానికి ఎందుకు ఖాళీ లేదు అన్న సందేహిం ప్రభాస్ అభిమానులను తీవ్రంగా బాధ పెడుతున్నట్లు టాక్. ‘గౌతమీపుత్ర’ శాతకర్ణి’ సినిమా మొదలుపెట్టిన కొన్ని రోజులకే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావడమే కాకుండా ఏకంగా ఆగస్టులో పెళ్లి కూడా క్రిష్ చేసుకోబోతు ఉంటే ప్రభాస్  మాత్రం  తన పెళ్లికి ‘బాహుబలి’ కి ముడిపెట్టి తన పెళ్లిని ఏళ్లకు ఏళ్లు వాయిదా వేయడం కరెక్ట్ కాదని ప్రభాస్ వీరాభిమానులు అభిప్రాయపడుతున్నారనే వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ తో సమానంగా వయసున్నవాళ్లు అతడి కంటే చిన్నవాళ్లు కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయి పోతూ ఉంటే  ప్రభాస్ కనీసం ఇప్పటికి కుడా తన పెళ్ళి విషయాన్ని లైట్ గా తీసుకోవడం ప్రభాస్ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. దీనితో క్రిష్ ను చూసైనా త్వరగా ప్రభాస్ పెళ్లి చేసుకునే మార్గం ఆలోచించాలని ప్రభాస్ అభిమానుల కోరిక అని అంటున్నారు. ఇంతకీ  తన అభిమానుల అభిప్రయలకు ప్రభాస్ విలువ ఇస్తాడో లేదో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: