మెగాస్టార్ చిరంజీవి 8 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి సినిమాగా చేస్తున్న సంగతి తెలిసిందే.. మెగా మేకోవర్ గా రాబోతున్న ఈ సినిమా తమిళ కత్తికి రీమేక్ అవుతుంది. అయితే తెలుగు మార్కెట్ దృష్ట్యా తెలుగులో చిన్న చిన్న చేంజెస్ చేశారట. వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్నారు.


రీసెంట్ గా మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేసిన ఈ సినిమాలో మొన్నటిదాకా యాక్షన్ సీక్వెన్సెస్ చేయగా ఇప్పుడు జైలు సీన్స్ చేస్తున్నారట. ఇక సినిమాలో డైలాగ్స్ ఇవే అంటూ కొన్ని చిరు మార్క్ డైలాగ్స్ లాక్ అయ్యాయి. ప్రస్తుతం నెట్లో హల్ చేస్తున్న ఆ డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. 


దుక్కి దున్నడమే తెలుసు వీళ్లకి దుర్మార్గం చెయ్యడం తెలియదు.. నాగలి పట్టడమే తెలుసు వీళ్లకి నరకటం తెలియదు... ఇప్పుడు మీరు వీళ్ల పొలాలకి నీళ్లు ఇవ్వకపోతే ఆ నాగలి పట్టిన చేతులే మీలాంటి కలుపు మొక్కల్ని నరుకుతూ మీ గుండెల్ని దున్నుకు పోతారు.. అంటూ చెప్పే ఈ డైలాగ్ సినిమాకే హైలెట్ అవనుంది. రైతుల భూములను కబ్జా చేసే కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో మునుపటి మెగాస్టార్ గా చిరంజీవి ప్రేక్షకాభిమానాన్ని పొందాలని చూస్తున్నారు.  


ఇక సినిమాకు దేవి మ్యూజిక్ అందిస్తుండగా.. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రితో చర్చలు జరుపుతున్నారట. కోలీవుడ్ విజయ్ కత్తి సినిమాతో వంద కోట్లు కలక్షన్స్ సాధించాడు. మరి చిరు సినిమా ఏ రేంజ్ లో వసూలు చేస్తుందో చూడాలి. సినిమాను అనుకున్న టైం కల్లా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: