యోగా బ్యూటీ అనుష్క కష్టాలు క్లైమేక్స్ వచ్చాయా అని అనిపిస్తోంది. దీనికి కారణం ఈమధ్య అనుష్కకు రాజమౌళి ఇచ్చిన గట్టి వార్నింగ్ అని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో అనుష్క లుక్ ను చూసి చాలామంది అదిరిపోయిన విషయం తెలిసిందే. 

అంతేకాదు ‘బాహుబలి 2’ లో రాజకుమారి దేవసేనగా ఇలాగే అనుష్క కనిపిస్తుందా అని సెటైర్లు కూడ వేసుకున్నారు. ఈ సెటైర్లు రాజమౌళి దృష్టి దాకా వెళ్ళినట్లు ఉన్నాయి. దానితో షాక్ అయిన రాజమౌళి అనుష్క తో ‘లైపో’ ట్రీట్ మెంట్ వెంటనే ప్రారంభించమని సలహా ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు కేవలం యోగా డైటింగ్ ల మీద నమ్ముకుంటే అనుష్క శరీరంలో మార్పులు వస్తాయనే నమ్మకం తనకు పూర్తిగా తగ్గి పోతోందని అందువల్ల అనుష్క ‘లైపో’ ట్రీట్మెంట్ ప్రారంభించడమే ఈ సమస్యకు పరిష్కారం అని రాజమౌళి అనుష్కకు సూచన లాంటి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. 
 
అయితే ‘లైపో’ లు ఆపరేషన్స్ వల్ల తన శరీరాన్ని తగ్గించు కోవడం తనకు ఇష్టం లేదని అందువల్ల యోగాతోపాటు ఎక్సర్ సైజులతో ఈ సమస్యకు పరిష్కారం ఉందని అనుష్క రాజమౌళికి వివరించినట్లు  తెలుస్తోంది. ‘బాభుబలి 2’ లో అనుష్కను తప్ప వేరేవారిని తీసుకునే ఆప్షన్ లేని రాజమౌళి అనుష్క ప్రస్తుతం సతమత మౌతున్న మెటబాలిజం ఇష్యూలకు కేవలం యోగాతో  పరిష్కారం దొరుకుతుంది అని అనుకోవడం పగటి కల అని అంటూ  ఆమె దేవసేనగా మారడానికి మరో ఆరు వారాల గడువు ఇచ్చాడని ఫిలిం నగర్ టాక్. దీనితో రాజమౌళి మాటలకు షాక్ అయిన అనుష్క ప్రస్తుతం  తీవ్ర గందర గోళంలో ఉంది అని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: