తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది ఇతర భాషల అమ్మాయిలు హీరోయిన్లుగా వచ్చారు. అయితే బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు కేవలం గ్లామర తరహా పాత్రల్లో కనిపిస్తూ ఒకటీ రెండు సినిమాలకే పరిమితం అయ్యేవారు. అయితే వీరికి పూర్తిగా భిన్నంగా చిన్నతనంలోనే బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన అందాల భామ అవికా గోర్. కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. ఈ సీరియల్ తీసే సమయంలో అవికా చాలా చిన్న అమ్మాయి..కానీ నటనా పరంగా మాత్రం అద్భుతాలు సృష్టించింది.

ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన అవికా మొదటి సారి హీరోయన్ గా తెలుగు సినిమాలో నటించడం విశేషం. హీరో రాజ్ తరుణ్ ఇంట్రడ్యూసింగ్ చిత్రం ‘ఉయ్యాల..జంపాల’ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అవికా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో వరుసగా ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి. అయితే ఎలాంటి దొందరపాటు పడకుండా మంచి సెలక్టీవ్ సినిమాలు తీస్తూ ముందుకు సాగుతుంది అవికా గోర్. తర్వాత సినిమా చూపిస్త మావా చిత్రం కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చింది ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

అవికా గోర్ కన్నడంలో ‘కేరాఫ్ ఫుట్ పాత్ 2’ సినిమాతో శాండల్ వుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. మురికివాడ వాసుల జీవితాన్ని నేపద్యంగా తీసుకొని రూపొందించిన ఈ సినిమా డైరెక్టర్ మాస్టర్ కిషన్. ఈ సినిమా  ఇండియా నుంచి అస్కార్ నామినేషన్ కు వెళ్లింది. సినిమాల వల్ల లభించిన గుర్తింపు కంటే సీరియల్స్‌తో వచ్చిన పేరు ప్రఖ్యాతులే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చాయి అంటోంది అవికా గోర్.  నేడు చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీహెరాల్డ.కామ్ టీమ్ శుభాకాంక్షలు తెలుపుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: