పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన మూవీకి పని చేసిన ఓ డైరెక్టర్ కి సహాయం చేశాడని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, గతంలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ కి ఇప్పుడు పవర్ స్టార్ సహాయం చేసినట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ మూవీ తరువాత హరీష్ శంకర్ చేసిన రామయ్యా వస్తావయ్యా అట్టర్ ప్లాప్ గా నిలిచింది.


ఈ మూవీ తరువాత హరీష్ శంకర్ ఫైనాన్షియల్ గానూ, కెరీర్ పరంగానూ ఎంతో నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న హరీష్ శంకర్ సుబ్రమణ్యం ఫర్ సేల్ మూవీకి పని చేసి...మంచి కమర్షియల్ సక్సెస్ ని పొందాడు. అయినప్పటికీ హరీష్ కి పిలిచి ఆఫర్ ఇచ్చే పరిస్థితి లేదు.


గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ...అది పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లింది కానీ, హరీష్ ని గుర్తించ లేదు. దీంతో హరీష్ శంకర్ పరిస్థితిని చూసిన పవన్  కళ్యాణ్...తన గురించి కొంత మంది హీరోలకి సజెస్ట్ చేశాడంట. అందులో ఒకరే అల్లుఅర్జున్. ‘సరైనోడు’ తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు హరీష్ శంకర్‌తో చేయటానికి కారణం ఇదే అని అంటున్నారు.


దీనికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాతగా ఉండనున్నారు. పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా తనకి సహాయం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న హరీష్ శంకర్...ప్రస్తుతం ఫుల్ హ్యాపీలో ఉన్నాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: