గోవా బ్యూటీ ఇలియానా అంటే నాజూకైన నడుముతో కుర్ర హృదయాలను ఉర్రూతలూగించిన రూపం గుర్తుకు వస్తుంది. అయితే ఇక్కడ కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో బాలీవుడ్ బాట పట్టిన ఇల్లి బేబ్ అక్కడ క్లిక్ అవ్వలేదు. పోని తనకు స్టార్ డం ఇచ్చిన సౌత్ సినిమా అయిన మరళ తనకు అవకాశం ఇస్తుందేమో అనుకుంటే అది జరగలేదు.


అడపాదడపా ఆఫర్లు వస్తున్నా వాటిని భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి చెడగొట్టుకుంటుంది. అయితే కెరియర్ ఎలా ఉన్నా సరే విలాసాలకు మాత్రం ఇలియానా లోటు లేదు అన్నట్టుంది. తను చిన్న నాటి నుండి గోవాలో ఉండటం వల్ల గోవా బీచ్ అంటే తనకు చాలా ఇష్టమని చెబుతుంది ఇలియానా. అంతేకాదు ముంబై బీచ్ లో కూడా తనకు తీపి జ్ఞాపకాలు ఉన్నాయంటుంది.


బీచ్ అంటే ఎంతో ఇష్టమున్న ఇలియానా ఉదయం నుండి సాయంత్రం దాకా అదే బీచ్ లో ఉంటుందట. డే లైట్ ఫేల్ అయ్యేదాకా బీచ్ లోనే ఉండేదాన్ని అంటుంది. సో అలా బీచ్ మీద తనకున్న మమకారాన్ని తెలిపింది ఇలియానా. మనసు ఉల్లాసంగా ఉండాలంటే ఆమెకే కాదు ఎవరికైనా బీచ్ లో తిరగాలనిపిస్తుంది. 


మొత్తానికి కెరియర్ లో జోష్ లేకపోయినా తనకు సరదాగా అనిపించే బీచ్ ల గురించి బోలెడు విషయాలు చెబుతుంది ఇలియానా. ఈ మధ్యనే అక్షయ్ కుమార్ రుస్తం సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఇల్లి బేబ్ చేతిలో ఉన్న ఆ ఒక్క సినిమా అయినా హిట్ కొట్టాలని చూస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా టీజర్ అదుర్స్ అనిపించేలా ఉంది. మరి ఇలియానాకు మంచి రోజులు వచ్చాయా లేదా అన్నది ఆ సినిమా రిజల్ట్ తో తెలిసిపోద్ది.    



మరింత సమాచారం తెలుసుకోండి: