బాలీవుడ్ లో సినిమా సీరీస్ లు అంటే ప్లాప్ లే ఎక్కువ. క్రిష్ - ధూమ్ మినహా సీరీస్ లు అసలు దారుణమైన ప్లాప్ లు పొందాయి. పైగా మనోళ్ళు సీరీస్ ల మీద పెద్దగా ఆసక్తి కూడా చూపించరు. ధూమ్ సీరీస్ మాత్రం ఎక్కువగా ఆదరించిన ప్రేక్షకులు ప్రతీ భాగాన్నీ ఆదరించారు. ఏ పార్ట్ ఆ పార్ట్ గా ధూమ్ , ధూమ్ 2 , ధూమ్ 3 అన్నీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. దొంగతనాలు, చేజింగ్ కాన్సెప్ట్ లూ ఇలా సాగుతూ వస్తోంది ఈ లెక్క.

 

విలన్ ని హీరోగా చూపించే ఈ సీరీస్ లో జాన్ అబ్రహాం, హ్రితిక్ రోషన్ , ఆమిర్ ఖాన్ లో నెగెటివ్ రోల్స్ లో ఇరగీసారు. ప్రస్తుతం ధూమ్ 4 కి సంబంధించి కథ నడుస్తోంది. ఈ సినిమాలో హీరో - విలన్ పాత్రకి సల్మాన్ ఖాన్ ని ఎప్పుడో ఎంపిక చేసారు. సల్మాన్ ఖాన్ సినిమా అంటే భారీ బడ్జెట్, అద్భుతమైన కథ ఇలా చాలా హడావిడి ఉంటుంది. సల్లూ భాయ్ ధూమ్ 4 లో హీరో అంటేనే భారీ కలక్షన్ లు వచ్చేస్తాయి కూడా. కానీ ధూమ్ నిర్మాతలకి భారీ షాక్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్. ఎట్టి పరిస్థితి లో తాను విలన్ పాత్రలు చెయ్యను అని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో ఖరాఖండి గా చెప్పేసి మైండ్ బ్లాక్ చేసాడు .

 

అతనే చెప్పాడు ..

 

" ప్రతీ నటుడూ నెగెటివ్ పాత్ర చెయ్యాలి అనుకుంటాడు, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తే తన సత్తా బయటపడుతుంది అనీ తన నటనా శక్తి ప్రేక్షకులకి తెలుస్తుంది అని అనుకుంటాడు కానీ నేను మాత్రం ఎప్పుడూ అలాంటివి కోరుకును , అస్సలు చెయ్యను కూడా చెయ్యను. నిజ జీవితం లో ఎలాగూ హీరోయిజం చూపించడం కుదిరే పని కాదు. కనీసం తెరమీద అయినా హీరో పాత్రలు చేస్తాను " అంటూ చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్. అయితే ధూమ్ 4 ప్రస్తావన రాకపోయినా , ఎవరూ ఆ విషయం అడక్కపోయినా ఆ సినిమా పేరు ఎత్తకుండానే ఇలా మాట్లాడాడు సల్మాన్ ఖాన్. సల్లూ భాయ్ ని విలన్ రోల్ లో చూసే ఛాన్స్ మనకి మిస్ అయ్యింది అన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: