టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండీ టాక్స్ గా మారిన హీరో సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం ఉన్న మెగాహీరోలలో ఎక్కువ సక్సెస్ రేటు కలిగి ఉన్న హీరోగా సాయిధరమ్ తేజ్ పేరు డైరెక్టర్స్ రికార్డ్స్ లో ఉంది. ఒక వైపు మెగాహీరోలు అయిన అల్లుఅర్జున్, రామ్ చరణ్ లు కేవలం భారీ బడ్జెట్ చిత్రాలను మాత్రమే చేస్తున్నారు. ప్రస్తుతం వీరు ప్రయోగాత్మక కథలకి ఏ మాత్రం ఆసక్తి చూపటంలేదు.


ఇటువంటి సమయంలో మంచి కథలతో చిన్న సినిమాలను తీసుకుంటూ గ్రాండ్ సక్సెస్ ని సాధిస్తున్నాడు సాయిధరమ్. దీంతో సాయిధరమ్ తేజ్ సక్సెస్ రేటు అటు దర్శకులకి, ఇటు నిర్మాతలకి చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది కొత్త దర్శకులు అలాగే టాప్ డైరెక్టర్స్ సైతం సాయిధరమ్ తేజ్ తో మూవీలని తీయాలని చూస్తున్నారు.


ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఎప్పటి నుండో ఓ డైరెక్టర్ తో పనిచేయాలని చూస్తున్నాడు. కానీ రామ్ చరణ్ కంటే ముందుగా సాయిధరమ్ తేజ్ ఆ డైరెక్టర్ తో పని చేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ షాక్ అయినట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.


ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు...గౌతమ్ మీనన్. గౌతమ్ మీనన్ వరుసగా నిర్మించే సినిమాలో సాయిధరమ్ తేజ్ సైతం ఉన్నారు.  వీరి కాంబినేషన్ లో ఓ మూవీ త్వరలోనే రానుందని అంటున్నారు. ఈ మూవీని తెలుగు,తమిళ, మళయాల భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు హీరోగా సాయిధరమ్ తేజ్‌ చేస్తున్నారని ఇప్పటికే ఇండస్ట్రీ కన్ఫర్మ్ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: