తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో వేరే చెప్పనవసరం లేదు..ఒక్క తమిళనాడులోనే కాదు యావత్ భారత దేశంలో రజినీ కాంత్ అంటే అభిమానించే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అంతే కాదు భారత దేశంలోనే కాకుండా చైనా,జపాన్,మలేషియా,సింగపూర్ దేశాల్లో కూడా రజినీకాంత్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం రజినీ నటించిన ‘కబాలి’ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది..అయితే ఇప్పటికే ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి..అంతే కాదు అదే రేంజ్ లో పబ్లిసిటీ కూడా అవుతుంది. కబాలి టీ షర్టు, కీ చైన్స్ ఆ మద్య విమానంపై కూడా కబాలి పోస్టర్ వెలిశాయి.
టాయిలెట్ కడితే కబాలీ టికెట్స్ ఫ్రీ
తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం రజినీ క్రేజ్ ని క్యాష్ చేసుకొని కొన్ని మంచి పనులు చేసేందుకు సరికొత్త స్కెచ్‌లు వేసినట్టు తెలుస్తోంది.మీ ఇంట్లో టాయిలెట్స్ నిర్మించుకోండి’ అని ప్రచారం మొదలు పెట్టిందట. ఇటీవల పుదుచ్చేరి ప్రభుత్వం 772 నివాసాల్లో 447 ఇండ్లకు మరుగుదొడ్లు లేవని గుర్తించిందట. రజీనీ అంటే పడిచచ్చే అభిమానులను దృష్టిలో పెట్టుకొని పుదుచ్ఛేరి ప్రభుత్వం ఆ పంచాయత్ వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. టాయిలెట్ నిర్మించిన వారి ఇంటికి కబాలీ చిత్ర టికెట్లు ఉచితంగా పంపిస్తామని ప్రకటించింది.

రజినీ మేనియా ఏమేరకు పనిచేస్తుందో తెలుసుకోవాలంటే కాస్త ఎదురుచూడాలి మరి. అంతే కాదు పుదుచ్ఛేరిలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలంటూ రజినీకాంత్కు ఆ ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.. సో మొత్తానికి రజినీ క్రేజ్ ఈ స్థాయిలో పెరుగుతుండడంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: