ఆ మద్య సోషల్ మాద్యమాల ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించిన పాకిస్థాన్ మోడల్, నటి కందీల్ బలోచ్ అత్యంత దారుణంగా తన సొంత తమ్ముడు హత్యచేయడం తెలిసిన విషయమే. అయితే పాకిస్థాన్‌లో వివాదాస్పద మోడల్ కందీల్ బలోచ్ హత్య ఆమె అభిమానుల్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది.   ముల్తాన్‌లో ఆమె సోదరుడు వసీమే ఆమెను గొంతునులిమి చంపిన ఘటన సంచలనం రేపింది.  అయితే అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రం ఇది పరువు కోసం చేసిన హత్య అని చెబుతున్నారు. సోదరి తన మాటవినకుండా హద్దుమీరి ప్రవర్తిస్తోందని కందీల్ సోదరుడు ఆగ్రహించాడని అంతే కాగా కొంత మంది మతచాందస వాదులు కూడా హద్దు మీరి ప్రవర్తిస్తున్నట్లుగా ముస్లిం మత విశ్వాసలపై చెడు ముద్ర వేస్తుందని ఎన్నో సార్లు కుటుంబ సభ్యులుకు కందీల్ ని కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఆమె సోదరుడు వసీమే ఆగ్రహంతో హత్య చేసినట్లు తెలుస్తుంది.  

2014లో కెమెరాకు సెక్సీ లుక్‌లతో పోజులిస్తూ ఆమె తన మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. సంప్రదాయాలు, మతాచారాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే పాకిస్థాన్‌లో ఇలాంటి వీడియోలు చాలావరకు నిషిద్ధం.  భారత్ లో కందీలిని పూనమ్ పాండే తో పోల్చారు.  సంప్రదాయాలు, మతాచారాలకు అన్నింటిని పక్కన బెట్టి మహిళలకు, సంప్రదాయాలకు భిన్నంగా.. ధైర్యంగానే వ్యవహరించింది.  ప్రధాని మోదీని చాయ్‌వాలా అని, ఇంగ్లీష్ మాట్లాడలేరని అంటూ కందీల్ గత ఫిబ్రవరి 26న వీడియోని పోస్ట్ చేసి దుమారం రేపింది. 2002లో గుజరాత్ అల్లర్లు చెలరేగినప్పుడు నాడు ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న మోదీ వాటిని అదుపుచేయలేకపోయారని ఆ వీడియోలో ఆమె ఆరోపించింది.

వేలెంటైన్స్‌డే నాడు అసభ్యకరమైన దుస్తులతో పోజులివ్వడం, పాక్‌లో మాజీ క్రికెటర్, రాజకీయ నేత అయిన ఇమ్రాన్ ఖాన్‌కు శాశ్వతంగా ప్రేయసిగా ఉంటానంటూ ప్రకటనలు చేయడం, ఇటీవల పాక్ మతగురువు ముఫ్తీ అబ్దుల్ క్వావీతో సన్నిహితంగా సెల్ఫీ దిగి సెన్సేషన్ సృష్టించడం ఆ మద్య పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఆమెను కుటుంబ సభ్యులు కూడా పలు మార్లు హెచ్చరించిన నేపథ్యంలో రంజాన్ పండుగకు ముందు దేశం విడిచిపోవాలనుకున్నది కందీల్ కానీ పండుగ తన కుటుంబ సభ్యులతో గడపాలని వచ్చి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: