హీరో ల కటౌట్ లకి పాలాభిషేకాలు చెయ్యడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అసలు ఈ కాన్సెప్ట్ మొదలు అయ్యిందే రజినీకాంత్ సినిమాల నుంచీ అని చాలా మందికి తెలీదు. అప్పట్లో ఆయన అభిమానులు దళపతి సమయం లో ఇలా పాలు పోసి తమ సరదా తీర్చుకునేవారు. అది రాను రాను ఒక అలవాటుగా మారిపోయింది. నెమ్మది నెమ్మదిగా పైత్యం గా తయారు అయ్యింది. రజిని సినిమా అనే కాదు ఏ సినిమా వస్తున్న వేలాది లీటర్ ల పాలు వృధాగా వేస్ట్ చేస్తూ ఉంటారు.

 

ఒక పక్క ఆకలితో అభాగ్యులు తల్లడిల్లుతూ ఉంటె కేవలం ఒక హీరో ఫోటో పెట్టిన కటౌట్ కి అన్నేసి పాలు పొయ్యడం ఎప్పుడూ విమర్శలు ఎదురుకొంటూ ఉంటుంది. అయితే ఈ సారి రజినీకాంత్ ఫాన్స్ విమర్శలతో పాటు ఇంకా సీరియస్ పరిణామాలు ఎదురుకోనేల ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై లక్షల విలువైన యాభై వేల లీటర్ల పాలు వృధా చెయ్యబోతున్నారు. ఈ విషయం స్వయంగా తమిళనాడు పాల వ్యాపారుల సంఘం వేసిన అంచనా.

 

తమిళనాడు లో దాదాపు 15% శాతం మంది తమ పిల్లలకి రోజూ పాలు కొనలేని దీన స్థితిలో ఉన్నారు అని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. అలాంటి సమయం లో రజినీకాంత్ లాంటి గొప్ప హీరోకి అభిమానులు అయ్యి ఉండి కూడా ఇలాంటి దురాచారం ఏంటి అంటూ చాలా మంది వాపోతున్నారు. కబాలి సినిమా విడుదల కి ముందే పాల వ్యాపారుల సంఘం ఈ విషయం బయటపెట్టి మరీ ఒక ప్రకటన చేసింది. ఇందులో రజిని అభిమానులు ఇలాంటి ఆలోచనలు చెయ్యద్దు అని వారిని కోరింది సంఘం.

 

అప్పట్లో అన్నామలై సినిమాలో రజినీకాంత్ పాల వాడిగా నటించారు అప్పటి నుంచీ ఈ ఆచారం మొదలు పెట్టారు. మొదట్లో తమిళనాడు లోని చెన్నయి , మదురై లలో ఈ వ్యవహారం మొదలయ్యి తరవాత తరవాత చాలా ప్రాంతాలకి విస్తరించింది. మిగితా హీరోల ఫాన్స్ కూడా ఈ సాంప్రదాయం అలవాటు చేసుకున్నారు. రజినీకాంత్ కనీసం ఒక చిన్న ట్వీట్ వేసినా కూడా వీరు సైలెంట్ అవుతారు ఏమో చూడాలి. జనం మాత్రం రజినీకాంత్ ఫాన్స్ అన్నింటా సూపర్ గానీ ఇలాంటి విషయాల్లో మాత్రం మూర్ఖులు అంటూ తిట్టి పోస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: