టాలీవుడ్ పెద్దాయన అక్కినేని నాగేశ్వరరావు తన కొడుకు పెళ్లి విషయం లో ఎలా ప్రవర్తించారు అనే వార్తలు ఇన్నేళ్ళ తారవాత బయటకి వస్తున్నాయి. ఎన్నో రొమాంటిక్ సినిమాలలో చాలా మంది హీరోయిన్ లతో నటించిన ఆయన తన కొడుకుని ఒక హీరోయిన్ కి ఇచ్చి కట్టబెట్టాలి అని ప్లాన్ వేసారట. నాగార్జున హీరో కూడా అవ్వకముందరే హీరోయిన్ సుమలత ని నాగార్జున కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని దృడంగా అనుకున్నారు అని తెలుస్తోంది.

 

ఆ విషయం హీరోయిన్ సుమలత స్వయంగా చెప్పడం విశేషం. " నాగేశ్వరరావు గారు ఒక సారి నన్ను పెళ్లి మీద నా ఉద్దేశ్యం ఏంటి అని అడిగారు. నేను షాక్ అయ్యాను. అమెరికా నుంచి రిటర్న్ అయిన ఒక కుర్రాడు ఉన్నాడు చేసుకుంటావా అని కూడా అడిగారు. నాకేం చెప్పాలో అర్ధం కాలేదు. మా అమ్మతో కూడా అవసరం అయితే మాట్లాడతాను అనీ , చాలా మంచి కుర్రాడు అనీ మాట ఇచ్చారు. మా అమ్మతో కూడా ఈ విషయం మాట్లాడాను నేను. మా అమ్మ ఆయన్ని కుర్రాడు ఎవరో ముందు చెప్పండి అంటే తన చిన్న కొడుకు నాగార్జున కోసం ఆమెని అడుగుతున్నాను అని అన్నారు ఆయన . దెబ్బతో నేను మా అమ్మా షాక్ అయ్యం. అప్పటికి నాగ్ ఇంకా సినిమా హీరో కూడా అవ్వలేదు. సినిమాల్లోకి అతను రాకముందరే అతనికి పెళ్లి చేసి తరవాత సినిమాలు మొదలుపెట్టాలి అని అనుకునేవారు నాగేశ్వరరావు గారు " అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది సుమలత.

 

 అన్ని విషయాలు చెప్పిన సుమలత ఇంటర్వ్యూ లో నాగేశ్వరావు ఇచ్చిన ప్రపోజల్ కి ఆమె ఎలాంటి జవాబు ఇచ్చింది, అసలు ఆయన వేసిన ప్లాన్ ఎలా ఫెయిల్ అయ్యింది అనేవి మాత్రం చెప్పలేదు. తండ్రి సుమలత ని కోడలుగా తెచ్చుకుందాం అనుకుంటే తరవాత కాలం లో హీరోయిన్ అమల ని నాగార్జున ఎంచుకున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: