ఇప్పుడు భారత దేశం అంతటా కబాలి మానియా నడుస్తుంది.  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లింగ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రంజిత్ దర్శకత్వంలో ‘కబాలి’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం దాదాపు షూటింగ్ మొత్తం మలేషియాలోనే సాగింది.  అక్కడ లోకేషన్స్ చాలా అద్భుతంగా చిత్రీకరించారట.  అంతే కాదు ఈ చిత్రం కూడా తమిళనాడు, మలేషియా ల మద్య జరిగిన కథ కు సంబంధించిందే కావడం విశేషం. ఇక ఈ చిత్రంలో రెండు అద్భుతాలు ఒకటి చాలా సంవత్సరాల తర్వాత రజినీకాంత్ పాత స్టయిల్ లో కనిపించడం మరోవైపు ప్రస్తుతం ఆయన ఏజ్ కి తగ్గట్టుగా తెల్లగడ్డంతో సాదా సీదాగా కనిపించడం..దీంతో అభిమానులకు ఈ చిత్రంపై చాలా క్యూరియాసిటి పెరిగిపోయింది. ఇక సౌత్‌లో కబాలి మూవీ ఫీవర్ పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది.  అంతే కాదు ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ యూట్యూబ్ లో పెను సంచలనాలకు నాంధి పలికింది.

రజినీకాంత్ కి సంబంధించిన పోస్టర్లు, ఫోటోలు కార్లపై, విమానం, టిషర్టు ఇలా రక రకాల వస్తువులపై ముద్రించి సరికొత్త ప్రచారం కొనసాగించారు. ఇక తమిళ తంబీల అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..భారీ ఎత్తున కటౌట్ల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి మొదలైంది. ఇక ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి ఈ చిత్రానికి సంబంధించి వీడియో మేకింగ్ ఒకటి రిలీజ్ చేశారు.

ఈ వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే 2 లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. లైక్ చేసిన వారి సంఖ్య 8 వేలు కాగా, డిస్ లైక్ చేసినవారి సంఖ్య కేవలం వందల్లో వుండడం గమనార్హం. టీజర్ తరహాలో మేకింగ్ వీడియో కూడా 24 గంటల్లోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ వుందని అభిమానులు భావిస్తున్నారు.  మొత్తానికి కబాలి 22 న విడుదల కాబోతుంది..అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: