సూపర్ స్టార్ రజినికాంత్ కబాలి మరికొద్ది గంటల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ట్రెండింగ్ ఉన్న కబాలి మూమెంట్ చూస్తుంటే ఇంతకుముందు ఏ సినిమాకు లేని విధంగా క్రేజ్ ఏర్పడింది. ఇక్కడే కాదు కబాలి ఓవర్సీస్ లో కూడా ఎంత భారీగా రిలీజ్ అవుతుందో తెలిసిందే. ఇక కబాలి మార్కెట్ కు మిగతా హీరోలు కనీసం తమ సినిమా రిలీజ్ ను రిలీజ్ చేయడం అటుంచితే కనీసం ఆలోచించడం కూడా మానేశారు.


కొద్దిరోజులుగా కబాలి చేస్తున్న హడావిడి చూస్తుంటే రజిని ఖలేజా ఏంటో తెలుస్తుంది. కబాలి క్రేజ్ కేవలం సౌత్ లోనే అనుకుంటే పొరపాటే నార్త్ లో కూడా కబాలి క్రేజ్ ఆకాశానికి తాకిందని చెప్పాలి. ఇప్పటికే ముంబైలోని రజిని ఫ్యాన్స్ కబాలి కోసం భారీ అడ్వాన్స్ బుకింగ్స్ చేస్తుండగా మరో ఫ్యాన్స్ గ్యాంగ్ కబాలి పేరున రకతదానాలు నిర్వహిస్తుంది.


ఓ సినిమా హీరోకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉండాలి అనేది శిఖరం తాకితే అది రజిని ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం రిలీజ్ అవుతున్న కబాలిలో రజిని మరోసారి భాషా బ్యాక్ గ్రౌండ్ తో వస్తారని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా చాలా చోట్ల షోస్ పడటం సినిమా మీద మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది.


సినిమాను రజిని ఫ్యాన్స్ కు ట్రీట్ గా ఉండేలా దర్శకుడు పా.రంజిత్ చక్కగా తెరకెక్కించాడట. మరి కబాలి సృష్టిస్తున్న సంచలనాలను ప్రత్యక్షంగా చూసి రజిని స్టామినా ఏంటో మరోసారి అందరికి తెలిసేలా చేసున్న ఈ సందర్భం రజిని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంలో ఉన్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: