బుల్లితెర మీద తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ అదే వంపు సొంపులతో సిల్వర్ స్క్రీన్ ను కూడా షేక్ ఆడించేస్తున్న రష్మి మొన్నటిదాకా జబర్దస్త్ సుడిగాలి సుధీర్ తో ఎఫైర్ నడిపిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే గుంటూర్ టాకీస్ సినిమాలో అమ్మడు ఆ హీరోతో రెచ్చిపోయే సరికి ఆ హీరో సిధార్థ్ తో రష్మి లవ్వాట అన్నారు. తీరా ఇప్పుడు రష్మి అతన్ని కూడా కాదని స్మాల్ స్క్రీన్ సూపర్ స్టార్ ప్రదీప్ తో లవ్ లో ఉందని అంటున్నారు.      


రష్మి, ప్రదీప్ వీరిద్దరి ఎలా అంటే.. జబదస్థ్ షోతో ఫుల్ పాపులారిటీ సంపాదించిన రష్మి చిన్నగా సినిమాల్లో కూడా అడ్డు అదుపు లేని అందాల ప్రదర్శనతో ఓ స్పెషల్ క్రేజ్ దక్కించుకుంది. ఇక సోలోగా వచ్చి స్మాల్ స్క్రీన్ పై సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్. గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమంతో స్టార్ట్ అయిన ప్రదీప్ ప్రయాణం నిర్విరామంగా సాగుతుంది.


ఇక కొంచం టచ్ లో ఉంటే చెప్తా తో సెలబ్రిటీస్ తో ప్రదీప్ చేసే చిట్ చాట్ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే సొంత టాలెంట్ తో కెరియర్ లో పైకి వచ్చిన ప్రదీప్ ప్రస్తుతం ఈటివి ఢీ జోడిలో రష్మితో కలిసి పనిచేస్తున్నాడు. రష్మి కామెంట్స్ కు అదే షోలో ఉన్న సుధీర్ ఫైర్ అవుతుంటే ఓ పక్క ప్రదీప్ రష్మిని చూస్తూ ఐస్ అవుతున్నాడట.  


ఇక రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో ఓ టాస్క్ లో సుధీర్ కు ప్రపోజ్ చేయమన్న రష్మి సుధీర్ పక్కన ఉండగానే ప్రదీప్ కు సిగ్నల్స్ ఇచ్చింది. సో ఈ కారణాలన్ని చూస్తుంటే రష్మి కొత్త లవర్ ప్రదీప్ అనే డౌట్ కలుగుచేస్తుంది. మరి హీరోయిన్ గా క్రేజ్ వచ్చాక ఇంకా బుల్లితెర హీరోలనే రష్మి కావాలనుకుంటుందా అన్నది తెలియదు కాని.. రష్మి ప్రదీప్ ల ఎఫైర్ కొత్త అప్డేట్ అని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: