జూనియర్ ఎన్.టి.ఆర్ నటవిశ్వరూపానికి సరైన ప్రతిబింబమే సిం-హాద్రి. తెలుగు సినిమాకు దిశ దశ నిర్దేశం చేసి బాక్స్ ఆఫీస్ రికార్డులకు సరి కొత్త భాష్యం చెప్పిన రాజమౌళి అద్భుతం. ఇప్పుడు ఆయన అభిమానులు ఎదురుచూస్తున్న కొరటాల దర్శకత్వము లో రూపుదిద్దుకుంటున్న సినిమా జనతాగారేజు రిలీజు కు సిద్దమౌతుంది. ఇందులో మళయాళ మహానటుడు సూపర్ స్టార్ మోహనలాల్ ముఖ్యపాత్ర పోషించారు.



 

మళయాళము లో తనమార్కెట్ పెంచుకునేందుకు జూనియర్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయొగములో భాగమే మోహన్ లాల్ తో ఈ సినిమా నిర్మాణం.   కబాలి సినిమా మళయాళ హక్కులు మొహన్ లాల్ చేజిక్కించుకున్నారు. అలాగే జనతా గారేజ్ మళయాళ హక్కులు మోహనలాల్ వే. అందుకే రెండినుండి ఆప్టిమం ప్రయోజనాలు పొందేందుకు ప్లాన్ వేశారు జూనియర్ & మోహనలాల్ కలిసి.


 

ఈ రోజు కబాళి దేశమంతా విదుదలైనట్లే మాళయాళం లో కూడా విడుదలౌతుంది. కబాళి సినిమా దూకుడుకి ఎన్.టి.ఆర్ మోహనలాల్ నటించిన మళయాళ వెర్షన్ జనతాగారేజ్ టేజరును కూడా అదే థియెటర్స్ లో నేడే రిలీజ్ చేస్తున్నారు. వన్ షాట్ టూ బర్డ్స్ అన్నమాట.


 

ఈ దెబ్బతో జూనియర్ మలయాళంలో గూడా దుమ్మురేపే చాన్స్ ఉందన్నమాట. మిర్చీ సినిమాతో కొరటాలకు మళయాళం లో కొంత పేరుంది అన్నీ కల్సివస్తే మళయాళంలో కూడా మనోడు ఒక ఊపూఉపొచ్చు.   



మరింత సమాచారం తెలుసుకోండి: