కబాలి తెలుగు వెర్షన్ విడుదల గురించి మొన్నటి వరకూ చాలా రాజకీయాలు జరిగాయి. మొన్న మన వెబ్సైటు లో చెప్పినట్టు చాటు మాటుగా బోలెడు గొడవలు జరిగాయి. సరిగ్గా విడుదల ముందు రోజున ఇవన్నీ వీధిన పడ్డాయి. రెండు రోజుల నుంచీ తెలుగు వెర్షన్ హక్కులు కొన్న కేపీ చౌదరి మీద విపరీతమైన వార్తలు వస్తున్నాయి. ఆయన విషయం లో రాజకీయాలు జరుగుతున్నాయి అనీ తెలుగు వెర్షన్ హక్కులు ఎవ్వరూ కొనకుండా ఆయనకే ఇచ్చారు అనీ ఆయన పాత సినిమాల విషయం లో నిండా మునిగాడు అనీ వార్తలు చెబుతుండగా ఇప్పుడు ఆయన ఏకంగా లైవ్ లోకి వచ్చేసారు.

కొత్త డిస్ట్రిబ్యూటర్ గా రంగం లోకి వచ్చిన కేపీ కబాలి సినిమా కోసం పేపర్ లో యాడ్ లు ఇస్తే వాటిని అడ్డుకున్నారు తెలుగు డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్ వారు. ఆయన దీని గురించి అడిగినప్పుడు దాసరి గారే ఆపమన్నారు అని చెప్పారు అన్ని కేపీ చెబుతున్నారు. " గతం లో కొచ్చాదియాన్, లింగా సినిమాలకి నష్టాలు పూరించే విషయం లో రజినీకాంత్ గారి మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఆయన ఇలా నష్టాలు పూడ్చే అలవాటు మొదలు పెట్టారు. బాబా సినిమా సమయం నుంచీ ఇది సాగుతోంది. అప్పట్లో వచ్చిన ప్లాప్ సినిమాలకి ఇప్పుడు డబ్బులు అడగడం ఏంటి ? అది కూడా డిస్ట్రిబ్యూటర్ గా తెలుగు లో కొనుక్కున నన్ను అడగడం ఏంటి ? నేను ప్రొడ్యూసర్ ని కాను కదా ? పాతిక లక్షల వరకూ డిమాండ్ చేసారు. నాకు లాభాలు ఒస్తే పాతిక కాదు ఇంకా ఎక్కువే ఇస్తా " అంటూ ఒక ఛానల్ తో లైవ్ లో మాట్లాడిన కబాలి తెలుగు ప్రొడ్యూసర్ సీరియస్ అయ్యారు.

 

" కొంతమంది నన్ను పేర్లు చెప్తే చంపేస్తాం అని బెదిరిస్తునారు, నేను కెసిఆర్ దగ్గరకి వెళ్లి వీరి మీద కంప్లైంట్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను. ఇదంతా ఒక మాఫియా లాగా నడుస్తోంది. డిస్ట్రిబ్యూటర్ లు ఎవ్వరూ సరిగ్గా పని చెయ్యడం లేదు. డబ్బులు ఎగ్గోట్టేసి బెహేవ్ చేస్తున్నారు " అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

 

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: