టాలీవుడ్ లో గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి తన 150 వ చిత్రంలో నటిస్తారు అని ప్రచారం జరిగింది. ఇక చిరంజీవి గత పది సంవత్సరాల క్రితం సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థిగి అయోమయంగా తయారైంది. దీంతో చిరు రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంతో తన 150 చిత్రాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రానికి తెలుగు లో రిమేక్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి వివివినాయక్ దర్శకత్వం వహించగా రాంచరణ్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఇక రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి గత కొంత కాలంగా కత్తిలాంటోడు అని పేరు వినిపిస్తున్న తరుణంలో రాంచరణ్ ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని అన్నారు. దీంతో ఇప్పుడు చిరు చిత్రానికి టైటిల్ విషయంలో కాంట్రవర్సీ మొదలైంది. అయితే ప్రస్తుతం చిరంజీవి 150 వ చిత్రం కనుక ఈ చిత్రంలో చిరు జైలుకు కూడా వెళ్తాడు కనుక ఖైదీ నెం.150 అని పేరు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో చిరంజీవి నటించిన ఖైదీ, ఖైదీ నెం.786 చిత్రాలు ఎంత హిట్ అయ్యాయో వేరే చెప్పనవసరం లేదు.

ఇక ఖైదీ అనే సెంటిమెంట్ కలిసి వచ్చేలా ఖైదీ నెం. 150 అని పెడితే బాగుంటుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. అంతే కాదు ఈ మద్య షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వచ్చాయి. అందులో చిరంజీవి ఖైదీ డ్రెస్ వేసుకొని కనిపిస్తున్నాడు.దీంతో ఈ మూవీకి ఖైద నెంబర్ 150 టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చిత్రయూనిట్ చేస్తోందట.  గత చిత్రాల సెంటిమెంట్ ఫాలో అవుతూ ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: