తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లింగా చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని పా రంజీత్ దర్శకత్వంలో ‘కబాలి’ చిత్రంలో నటించారు.  అయితే ఈ చిత్రంలో రెండు విశేషాలు ఎప్పటి నుంచి ప్రేక్షకులకు ప్రత్యేకంగా నిలుస్తూ వచ్చాయి..అవే రజినీకాంత్ గత ముప్పయి సంవత్సరాల క్రితం వయసులో ఎలా ఉన్నాడో అలా కనిపించడం..ప్రస్తుతం ఆయన వయసుకు తగ్గట్టుగా కనిపించడం. అయితే ఈ రెండు పాత్రల్లో రజినీ అద్భుతమైన నటన ప్రదర్శించినట్టు టాక్.  ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కబాలి శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.దేశంలోనే గాక, విదేశాల్లో నూ సెన్సేషన్ సృష్టించిన ఈ కబాలీ ఫస్ట్ టాకేంటి..? అన్న విషయానికి వస్తే చాలా మంది చాలా రకాలుగా తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నారు.  

అమెరికాలో ఈ సినిమా ప్రివ్యూ చూసిన ఓ వ్యక్తి ఈ మూవీలో మరీ అంత సీన్ లేదని, తాను సినిమా చూశాక మిశ్రమ స్పందన వెల్లబుచ్చాడు. ఇక చిత్ర కథనానికి వస్తే...మలేషియా లో తమిళుల దురవస్థ  పై ఓ సామాన్య వక్తి ఎలా పోరాడాడు..ఎలా మాఫియా లీడర్ అయ్యాడు అన్ని విషయాన్ని డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించాడట. సినిమా ఇంట్రడక్షన్ జైలు సీన్..తర్వాత మొదటి ఫైటింగ్ అద్భుతంగా తీశారట. అయితే గతంలో వచ్చిన బాష చిత్రంలాగా మొదట కబాలి (రజినీకాంత్) చాలా సింపుల్ గా కనిపిస్తాడట. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల  శత్రువుల నుంచి తన కూతురిని కాపాడుకునేందుకు గ్యాంగ్ స్టర్ గా మారుతాడు. మలేషియాలో తమిళులు, దళితుల నాయకుడిగా మారి వారి జీవితాల్లో మంచి మార్పు తెస్తాడు.

ఈ క్రమంలో తన భార్యను పోగొట్టుకుంటాడు..మాఫియా తో గొడవ పెట్టుకొని 20 ఏళ్లు జైలు జీవితం అనుభవిస్తాడు. 20 ఏళ్ల తర్వాత తన భార్యను చంపినవాడిపై అనుక్షణం పగతో రగిలిపోతాడు. వాళ్లని ఎలాగైనా మట్టుబెట్టాలని ప్లాన్ చేసిన టైమ్‌లో ఓ విషయం తెలుస్తోంది. తన వైఫ్ రాధికాఆప్టే బతికే వుందని తెలుస్తుంది. ఆమె కోసం ఇండియాకు బయలుదేరుతాడు. అయితే ఇండియాలో కూడా కబాలికి కొన్ని కష్టాలు వస్తాయి..వాటిని ఎలా ఛేదించాడు. రెండు దశాబ్దాల కిందట దూరమైన భార్యకి కబాలి దగ్గరయ్యాడా? మలేషియాలో తమిళులు పడుతున్న బాధలకు విముక్తి కల్పించాడా..తన జీవితాన్ని నాశనం చేసిన మాఫియాను ఎలా అంతం చేశాడు అన్ని అంశాలు డైరెక్టర్ చాలా చక్కగా చూపించాడట.

అయితే ఈ చిత్రం ఫస్టాఫ్ చూస్తే.. కబాలి ఎంట్రీ, ఇంటర్వెట్ బ్యాంగ్ మూవీకే హైలైట్! ఇక సెకండాఫ్‌కి వస్తే స్లో నేరేషన్ పెద్ద మైనస్. చాలా చిత్రాల్లో  రజనీ చేసిన అద్భుతాలు, స్టంట్లే కబాలిలోనూ రిపీట్ అయినట్టు కనిపిస్తుంది. అక్కడక్కడా తమిళ పోకడ సహజం. మొత్తానికి ఇది ఏవరేజ్ సినిమా అనే టాక్ మూటగట్టుకుంది. ఇక ఈ చిత్రం కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయి..రేపటి వరకు పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: