సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి. ఇక బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని సైతం నిద్రపోకుండా చేస్తున్న మూవీ కూడ కబాలినే. దాదాపు నాలుగువైల అయిదువందల థియోటర్స్ కి పైగా ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీని మొదటి రోజే చూడటం కోసం తమిళనాడు, బెంగుళూరులో అఫిషియల్ హాలిడేలను కొన్ని కంపెనీలు ప్రకటించాయి. దీంతో కబాలి మూవీకి ఇంటర్నేషనల్ హైప్ క్రియేట్ అయింది.

అయితే ఏ మూవీ అయినా ఎంతటి భారీ హైప్ తో వచ్చినప్పటికీ...రిలీజ్ రోజున అందరూ అడిగే ప్రశ్నా, హిట్టా?ప్లాపా?. అవును ఇప్పుడు ప్రతి ఒక్కరూ కబాలి మూవీని హిట్టా?ప్లాపా? అంటూ అడుగుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా ఊహకూ అందని ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి. మొదటిరోజు బాక్సాపీస్ 60 కోట్ల రూపాయలను అవలీలగా టచ్ చేయనుంది.

అయితే కేవలం రజనీకాంత్ అభిమానులు మాత్రం ఈ మూవీని చూసేటట్టుగా దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించాడని అంటున్నారు. ఇక కథలో కొత్తదనం లేదని చాలా మంది సాధారణ ఆడియన్స్ చెప్పుకువస్తున్నారు. రజనీకాంత్ ని చూడటం కోసం సినిమాకు వచ్చాం కానీ, కథ మామూలుగానే ఉందని చాలా మంది వారి నిర్ణయాన్ని చెప్పుకువస్తున్నారు.

సెకండాఫ్‌లో సినిమా మరీ నెమ్మదిగా నడిచి బోర్ కొట్టించిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. అయితే కబాలి మూవీని ప్రతి ఒక్కరు రజనీకాంత్ కోసమే చూడాలి తప్పితే, ఇది రజనీ స్థాయిలో ఉండే చిత్రం కాదనేది సాధారణ ప్రేక్షకుడి తీర్పు అని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: