నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ ఆగిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే నట సింహం బాలకృష్ణ స్వయంగా ఈ షూటింగ్ వాయిదా వేసాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వాయిదా వెనుక ఒక కారణం ఉంది. ఈసినిమా దర్శకుడు క్రిష్ పెళ్ళి వచ్చేనెల జరుగుతున్న నేపధ్యం తెలిసిందే.

అయితే తన పెళ్ళి విషయాలను కూడ మర్చిపోయి కేవలం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయాల పైనే పూర్తిగా మనసు పెట్టిన క్రిష్ ఏకాగ్రతను చూసి బాలయ్య చెలించిపోయి ఈసినిమా షూటింగ్ ను తాత్కాలికంగా ఆపు చేయమని బాలయ్య పట్టుపట్టినట్లు టాక్. ఆగస్టు 8న హైదరాబాద్‌కు డాక్టర్ రమ్యను క్రిష్ పెళ్లాడబోతున్న విషయం తెలిసిందే. 

గత నెలలోనే నిశ్చితార్థం కూడా జరిగింది ఆ ఫంక్షన్ పూర్తికాగానే ‘శాతకర్ణి’ కొత్త షెడ్యూల్ కోసం జార్జియాకు బయల్దేరిపోయాడు క్రిష్. దీనితో క్రిష్ తన పెళ్లి ఏర్పాట్లను చేసుకోవడానికి వీలుగా బాలయ్య ఈ బ్రేక్ ఇవ్వడంతో ఈ సినిమా యూనిట్ ఒకట్రెండు రోజుల్లో క్రిష్ జార్జియా నుంచి హైదరాబాద్‌కు రాబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. 

జార్జియాలో క్లైమాక్స్ సన్నివేశాల్ని  వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులతో వందల సంఖ్యలో గుర్రాలతో భారీ స్థాయిలో క్రిష్ చిత్రీకరిస్తున్నప్పుడు క్రిష్ గుర్రం ఎక్కి బాలకృష్ణకు ఆ సన్నివేశం గురించి వివరిస్తున్న ఫోటోను క్రిష్ ఈరోజు తన ఫేస్ బుక్ లో పెట్టుకున్నాడు. బాలయ్య సరసన శ్రియ నటిస్తున్న ఈ సినిమాలో కబీర్ బేడి లాంటి బాలీవుడ్ యాక్టర్‌తో పాటు అలనాటి అందాల తార హేమమాలిని కూడా కీలక పాత్రలు పోషిస్తున్న ఈసినిమాను ఎట్టి పరిస్తుతులలోను సంక్రాంతి రేస్ కు వచ్చే విధంగా బాలయ్యా క్రిష్ లు తీవ్రమైన కృషి చేస్తున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: