జబర్దస్థ్ షోతో మంచి పాపులారిటీ సంపాదించిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు సుధీర్ టీంలో కామెడీ పండిస్తుంటారు. అయితే ఈ మధ్య జబర్దస్థ్ కామెడీ యాక్టర్స్ తో మిగతా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసిన ఈటివి యాజమాన్యం ఒక్కొక్కరికి ఒక్కో గేం షో ప్లాన్ చేసింది. ఇక సుధీర్ రష్మిల జోడితో ఢీ జోడి అనే డ్యాన్స్ ప్రోగ్రాం ను స్టార్ట్ చేసింది.  


ఈ జోడి స్పెషల్ ఏంటంటే ప్రతి వారం ఓ స్పెషల్ జోడి ఈ ప్రోగ్రాంకు ఇన్వైట్ చేయబడతారు. ఇక సుధీర్, రష్మిల అల్లరితో ప్రోగ్రాం అంతా హుశారెత్తుతుంది. ఇక లాస్ట్ ఎపిసోడ్ లో గెటప్ శ్రీను తన అర్దాంగి సుజాతలను గెస్ట్ లుగా ఇన్వైట్ చేశారు. ఇక శ్రీను సుజాతల ప్రేమ పెళ్లి గురించి అడిగి తెలుసుకున్న యాంకర్ ప్రదీప్ ఆ క్రమంలో సుధీర్ తమ ప్రేమకు విలన్ అయిన విధానాన్ని వివరించాడు.


సుధీర్ తమ్ముడికి స్నేహితురాలైన సుజాత తన ద్వాతా శ్రీనుకి పరిచయం అయ్యింది. అయితే మొదటి పరిచయంలోనే శ్రీను సుజాతల ప్రేమ చిగురించడంతో ఆ విషయాన్ని సుధీర్ దగ్గర దాచాడట. సుధీర్ కు విషయం తెలిసే సరికి శ్రీను సుజాతల ప్రేమ ముదిరిపోయిందట. ఇక చేసేదేమి లేక ఇద్దరు ఇష్టపడితే తాను కూడా ఒకే అన్నాడట.  


ఇక శ్రీను, సుజాతల ప్రేమకు పెళ్లికి సుధీర్ ముఖ్య కారకుడిగా అయ్యాడన్నమాట. జబర్దస్థ్ షోతో మంచి పాపులారిటీ సంపాదించిన గెటప్ శ్రీను సుధీర్ టీం లో రకరకాల గెటప్స్ తో మంచి కామెడీ చేస్తుంటాడు. మరి శ్రీను పెళ్లికి కారణమైన సుధీర్ కు శ్రీను కూడా తన తరపున ఎవరినైనా చూపిస్తే బెటర్ కదా అంటే అమ్మో ఆ అమ్మాయి పరిస్థితి నేను ఊహించలేని అంటూ కామెంట్ చేయడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: