టాలీవుడ్ లో 'బాహుబలి' తరువాత అంత హైక్ క్రియేట్ చేసుకున్న సినిమా ఒక్క ‘కబాలి’ సినిమా మాత్రమే. ఇప్పటికే ‘బాహుబలి’ ఓవర్సీస్ రికార్డులను బ్రేక్ చేసిన ‘కబాలి’ సెటైర్ల విషయంలో కూడ ‘బాహుబలి’ ని దాటిపోయింది. ప్రస్తుతం ‘వెబ్ మీడియాలో చాలామంది ‘కబాలి’ ని ఒక ఆటాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో  జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద 'కబాలి' వీడియో -  మెగాస్టార్‌ మీదా -  అల్లరి నరేష్‌ మీదా ఇలా అందరు టాప్ సెలెబ్రెటీలు ‘కబాలి’ పాత్రను చేస్తే ఎలా ఉంటుందో వారు నటించిన వివిధ సినిమాల్లోని సీన్లు తీసుకుని వాటిని ‘కబాలి’ టీజర్‌ని పోలి ఉండేలా రూపొందించి సెటైర్లు వేస్తున్నారు. 

దీనితో నిన్న విడుదలైన ‘కబాలి’ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఇంకా దాని హడావిడి షోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘కబాలి’ పై పేరడీలే కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన ‘కబాలి’ టాక్ ఎలా తెచ్చుకున్నా ‘బాహుబలి’ రికార్డును మాత్రం బద్దలు కొట్టింది. 

ఈసినిమా అమెరికా, కెనడాల్లో ఒక్క ప్రీమియర్ షోల ద్వారా దాదాపు 13 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్‌లో తెలియచేసాడు. సౌత్ నుంచి ఇప్పటివరకు బాహుబలిదే రికార్డ్ దీన్ని అధిగమించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని గతంలో విశ్లేషకులు భావించారు. అయితే ‘కబాలి’ స్పీడ్ కు అది కనుమరుగై పోయింది. 

ఈ వార్తలు ఇలా ఉంటే ఈసినిమాకు వచ్చిన భారీ ఓపెనింగ్స్‌ సంగతి పక్కన పెడితే ఈ సినిమాను కోలీవుడ్  టాలీవుడ్ లలో కొనుక్కున్న బయ్యర్లు మునిగిపోవడం ఖాయం అని అంటున్నారు. మొత్తం మీద సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వరస మూడు సినిమాలను కొనుక్కున్న బయ్యర్లు  కోలుకోలేని అప్పుల ఊబిలో కూరుకుపోయారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విధంగా చూసుకుంటే రజినీ పేరిట ఏర్పడ్డ ఇదో చెత్త రికార్డు అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: