సన్నీ లియాన్ అనగానే పోర్న్ నటి అనే ఫీలింగ్ పోయి నెమ్మది నెమ్మదిగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనే పేరు ఒస్తోంది. ఆమెకి ఒచ్చిన ఒక అవకాశం ఇప్పుడు ఆమెని ఇబ్బంది పెట్టేస్తోంది. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం ఎలాంటిది తనని ఎలాంటి ఇబ్బందులకి గురి చేస్తుంది అని ఎవ్వరైనా సరే పరిశీలించుకోవాలి. ఏ అవకాశం వెనకాల అయినా సరే మంచీ చెడూ రెండూ కలగలిసి ఉంటాయి.

 

సెలెబ్రిటీ లకి ఈ మధ్య కాలం లో పబ్లిక్ ఫంక్షన్ లు అన్నీ కూడా తలనొప్పిని తీసుకొచ్చే విధంగానే సాగాయి. అడల్ట్ కామెడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న సన్నీ ఇప్పుడు జాతీయ గీతాన్ని అవమాన పరిచింది అంటూ డిల్లీ అశోక్ నగర్ లో పోలీస్ కేసు నమోదు అయ్యింది. ప్రో కబాడ్డీ లీగ్ లో భాగంగా గురువారం సన్నీ ని ప్రత్యేక అతిధి గా ఆహ్వానించారు. ఆట ప్రారంభం అయ్యే ముందర ఆమెతో జాతీయ గీతం పాడించారు నిర్వాహకులు. ఆమె ఈ ఛాన్స్ తో చాలా సంతోష పడి పాడేసింది. తడబడుతూ, రాకపోయినా ఎదో అలా అలా పాడేసింది ఆమె. దీన్ని చూసిన జనం బాగానే ఉన్నారు గానీ ఒకామె మాత్రం సీరియస్ అయ్యారు.

 

దేశ గౌరవాన్ని చాటి చెప్పే జనగణమన గీతం ఆలపించడం అనేది చట్ట రిత్యా ఉన్న ప్రాక్టీస్ ని ఉల్లంఘించడం లోకి వస్తుంది అంటూ ఆమె మీద ఫిర్యాదు అన్డిది. ఫిర్యాదు ని ఇంకా కేసుగా పెట్టలేదు అనీ ప్రాధమిక దర్యాప్తు జరుపుతున్నాం అని పోలీసులు చెబుతున్నారు. ఫిర్యాదు దారు చెప్పింది ఎంతవరకూ నిజమే అనేది తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు పోలీసులు. జాతీయ గీతాన్నికానీ.. మరేదైనా కానీ కావాలని అవమానించటం వేరు.. అవగాహన రాహిత్యంతో తప్పు చేయటం వేరు. సన్నీ బాష రాక మాత్రమే అలా పాడింది తప్ప కావాలని అవమానం చెయ్యలేదు అని ఆమె ఫాన్స్ వాదిస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: