ప్రపంచ వ్యాప్తంగా 4,500 స్క్రీన్స్ లో విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిల్మ్ కబాలి. ఇంత పెద్ద సంఖ్యలో ఏ మూవీ రిలీజ్ అయినా, దాని పైరసీ కూడా అంతే వేగంగా మార్కెట్ లోకి వస్తుంది. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఎన్నో సినిమాలకి ఇలాంటి అనుభవం ఎదురయింది. ఆ విధంగా కబాలి మూవీ సైతం పైరసీ నుండి తప్పించుకోలేకపోయిందనే చెప్పాలి.


నిజానికి ఈ మూవీ రిలీజ్ కాకముందే కొన్ని సీన్స్ నెట్ లో లీకై ప్రత్యక్షం అయ్యాయి. తరువాత వాటిని డిలీట్ చేసినప్పటికీ, రిలీజ్ రోజున పైరసీ పంజా కబాలి మూవీపై స్పష్టంగా కనిపించింది. శుక్రవారం రిలీజ్ అయిన కబాలి మూవీకి, అలా మొదటి షో పూర్తయిందో లేదో తమిళ వెర్షన్ కి సంబంధించిన హెచ్.డి క్వాలిటీ వీడియో బయటకు వచ్చిందని చాలా మంది నెటిజెన్స్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు.


ఆ తరువాత కొద్ది గంటలకే తెలుగు వెర్షన్ కి సంబంధించిన క్వాలీటి వీడియో సైతం బయటకు వచ్చిందనేది నెటిజెన్స్ రిపోర్ట్.  అయితే కబాలి చిత్ర యూనిట్ పైరసీ వీడియోలను పసిగట్టి మరీ వాటిని బ్లాక్ చేసింది. కానీ కొద్ది గంటల పాటు కనిపించిన ఆ వీడియోలను యూజర్స్ లక్షల్లో డౌన్ లోడ్ చేసుకున్నట్టుగా పైరసీ సెల్ రిపోర్ట్ ని ఇచ్చింది.


ఒక్క రిలీజ్ రోజునే పైరసీ సెల్ వారు కబాలి మూవీకి సంబంధించిన దాదాపు 300 సైట్స్ ని బ్లాక్ చేశారు. అలాగే 700 లింక్స్ ని పూర్తిగా డిలీట్ చేశారు. అయితే వీరు ఎంత ప్రయత్నించినప్పటికీ...ఎక్కడో ఒక చోట మాత్రం కబాలి మూవీకి సంబంధించిన పైరసీ వీడియో ప్రత్యక్షం అవుతూనే ఉంది. దీంతో చిత్ర నిర్మాతకి ఇది నిద్రలేకుండా చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రదర్శన సక్సెస్ ఫుల్ గా అన్ని థియోటర్స్ లో జరుపుకుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: