మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ కు పెద్ద సాన్నిహిత్యం లేదు. అదేవిధంగా ఈ సినిమా దర్శకుడు రంజిత్ కు  త్రివిక్రమ్ కు కూడా స్నేహం లేదు. అయినా ‘కబాలి’ ని చూసి త్రివిక్రమ్ భయపడుతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో  ‘కోబలి’ అనే సినిమాను చేద్దాము అని అనుకున్నాడు. 

రాయలసీమ నేపధ్యంలో నడిచే ఈ కథ ఒక వాస్తవ కధ. ఈ సినిమా స్క్రిప్ట్ పై కొంతకాలం త్రివిక్రమ్ పని చేసినట్లుగా వార్తలు కూడా గతంలో వచ్చాయి. అయితే కొన్ని కారణాల రీత్యా ఈ ప్రాజెక్ట్ మొదలు కాకపోయినా ఏదో ఒక నాటికి పవన్ తో ఈ సినిమాను తీయడం త్రివిక్రమ్ కల. సాధారణంగా ఇండస్ట్రీలో ఓ టైటిల్ హిట్ అయితే దర్శక నిర్మాతలు అలాంటి టైటిళ్ల వెంట పడతారు. 

అదేవిధంగా ఒక సినిమాలోని పాట హిట్ అయితే ఆ పాట పల్లవులు సినిమా టైటిళ్లయిపోతాయి.  ఇప్పుడు  ‘కబాలి’ సినిమా విఫలం కావడంతో త్రివిక్రమ్ సినిమా ‘కోబలి’ సినిమా టైటిల్ గురించి ఇక ఆలోచించడెమో అన్న సెటైర్లు పడుతున్నాయి. ‘కబాలి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలం కావడంతో ‘కోబలి’ సినిమా అంటే జనాలకు ముందుగా ‘కబాలి’ నే గుర్తుకువస్తుంది కాబట్టి అటువంటి సాహసం ఇక త్రివిక్రమ్ చేయడు అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు.

అయినా త్రివిక్రమ్ ఇప్పుడు పవన్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను రూపొందించే పనిలో బిజీగా ఉన్న నేపధ్యంలో త్రివిక్రమ్ తన ఆలోచనల నుండి  శాస్వితంగా ‘కోబలి’ టైటిల్ ను తప్పించినా ఆశ్చర్యం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈవార్తలు ఇలా ఉండగా పవన్ డాలీ దర్శకత్వంలో నటించబోయే సినిమా ఆగష్టు నుండి ప్రారంభం అవుతున్న నేపధ్యంలో పవన్ త్రివిక్రమ్ ల మూవీ వచ్చే సంవత్సరం మాత్రమే  ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉండటంతో తన ప్రియమిత్రుడు పవన్ తనను ఇలా బంధీగా మార్చి ఇలా ఏకంగా ఇలానెలల తరబడి వెయిట్ చేయించడం త్రివిక్రమ్ కు బయటకు చెప్పుకోలేని బాధగా మారింది అని టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: