సినిమా ఇండస్ట్రీ చాలా వరకు ప్రేమ వివాహాలు చేసుకున్న వారే ఉన్నారు. హీరో, హీరోయిన్లు ప్రేమించి పెళ్లీ చేసుకుంటే..కొంతమంది హీరోయిన్లు టెక్నీషియన్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా చేసుకున్న వారు చాలా వరకు కలిసి ఉంటే చేసుకున్న కొద్దిరోజుల్లోనే వారి పెళ్లి పెటాకులైన సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా హీరోయిన్ అమలాపాల్ ఫ్యామిలీలైఫ్‌లో కలతలు మొదలైనట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి.  ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట అమలా పాల్ - విజయ్ లది , అయితే కొన్నాళ్ళ పాటు చెట్టా పట్టాలేసుకొని తిరిగిన ఈ జంట మద్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి.  

రెండేళ్ల కిందట తమిళ డైరెక్టర్ విజయ్‌ను మ్యారేజ్ చేసుకున్న విషయం తెల్సిందే!  పెళ్లి అయిన తర్వాత భర్తతో జాలీగా విదేశాలు చుట్టొచ్చిన అమలాపాల్, అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో రావడం, తనను భర్త చాలా బాగా చూసుకుంటున్నారని వెల్లడించింది.  గతకొంత కాలంగా ఈ ఇద్దరి మద్య మనస్పర్ధలు వచ్చాయని అంటున్నారు . భార్యాభర్తలు అన్నాక తప్పనిసరిగా ఏవో చిన్న చిన్న గొడవలు సహజం అయితే కొంతమంది మాత్రం ఆ గొడవలను పెద్దది చేసి చెబుతున్నారు. నటుడు ధనుష్ నిర్మించిన అమ్మాకణక్కు ఫిల్మ్‌లో కీలకరోల్ చేసింది అమలాపాల్. అప్పటివరకూ సినిమా వేడుకలకు, ఇతర కార్యక్రమాలు విజయ్- అమలాపాల్ కలిసి హాజరయ్యేవారు.

అలాంటిది ఈ మధ్య ఆ జంట కలిసి ఎక్కడా  కనిపించడం లేదన్నది తాజావార్త. అమలా పాల్ సినిమాల్లో నటించడం ఇష్టం లేదని ఈ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయనేది ఎట్ ప్రజెంట్ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదే వీళ్లిద్దరి మధ్య విభేదానికి కారణాలుగా చెబుతున్నాయి. రెండు నెలలుగా వీరిద్దరూ కలసి బయట ఎక్కడా కనిపించకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. అదే వీళ్లిద్దరి మధ్య విభేదానికి కారణాలుగా చెబుతున్నాయి.  ఏమైనా ఈ విషయంపై ఎవరో ఒకరు స్పందిస్తేనే గాసిప్స్‌కు ఫుల్‌స్టాప్ పడొచ్చని అంటున్నారు సిని ఇండస్ట్రీ వారు...ఏది ఏమైనా ఈ జంట చక్కగా కలిసి ఉండాలని కోరకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: