కబాలి.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమా గురించి జరిగినంత ప్రచారం వేరే ఏ సినిమాకూ జరగలేదు. అందులోనూ ఓ ప్రాంతీయ భాషా చిత్రానికి ఈ ఘనత దక్కడం విశేషం. అది సరే కబాలి.. ఈ పేరేంటి.. ఈ పేరే ఈ సినిమాకు ఎందుకు పెట్టారు.. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన నేపథ్యమే ఉందట. అదేంటో చూద్దాం..

కబాలి అనే పదం కపాలి అనే పదం నుంచి వచ్చింది. తమిళ భాషలో ప లేదు కనుక బ అని వాడతారు. అందుకే కపాలి.. కబాలి అయ్యింది. కపాలి అంటే శివుడు. చెన్నైలోని మైలాపూర్ లో కపాలేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ పరమశివుడి కోసం ఉమా దేవి నెమలి రూపంలో తపస్సు చేసిన కారణంగా ఈ ఊరికి మైలాపూర్ అని పేరు వచ్చింది.


రజినీకాంత్ కు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. అందుకే తన సినిమాల ద్వారా కూడా ఆయన ఆధ్యాత్మికతను చొప్పిస్తుంటారు. ఆయన సినిమాలకు అరుణాచలం,  బాబా, లింగా వంటి పేర్లు పెట్టడానికి కూడా అదే కారణమట. తమిళ నాట రజనీకాంత్ వల్లనే చాలామంది అరుణాచలం మొదలైన శైవ క్షేత్రాలకు వెళుతున్నారట.
 
మంచి పేరున్న నటుడైన రజనీకాంత్ తన సినిమా పేర్లకు అరుణాచలం, లింగ, బాబా మొదలైన పేర్లను కావాలనే ఎంచుకుని, ఆయా క్షేత్రాల, గురువుల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకువచ్చారని ఈ మధ్యే అక్కడున్నవారి ద్వారా తెలిసింది. ఇదిగో ఇప్పుడిలా మళ్ళీ కబాలి పేరుతో కపాలీశ్వర స్వామి గురించి తమిళ ప్రజలకు చాటి చెప్తున్నారు. అదీ టైటిల్ కబాలి కథ.



మరింత సమాచారం తెలుసుకోండి: