న్న రాత్రి జరిగిన ‘బాబు బంగారం’ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ వెంకటేష్ అందరి మైండ్స్ బ్లాంక్ చేస్తూ ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. గత కొంత కాలంగా తానూ తన  సినిమాలను బాగా తగ్గించుకోవాలని అనుకున్నానని  అయితే ‘బాబు బంగారం’ లో తన లుక్ తన ఎనర్జీ చూకున్న తరువాత మరో 15 సంవత్సరాలు తాను నటిస్తూనే ఉంటానని కామెంట్స్ చేసాడు వెంకటేష్. అంతేకాదు తన కొడుకు  అర్జున్ హీరో గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేదాకా తానూ నటిస్తూనే ఉంటానని తనకు వారసుడుగా తన కొడుకు రాబోతున్నాడు  అంటూ సంకేతాలు  ఇచ్చి తన అభిమానులకు జోష్ ఇచ్చాడు. 
 
నిన్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో విడుదలయిన ఈ ట్రైలర్ ను చూసిన వారు అంతా వెంకటేష్ లుక్ చాలా అందంగా కనిపించడమే కాకుండా అతడి నటనలో పూర్తి ఎనర్జీ కనిపిస్తూ ఉండటంతో ‘బొబ్బిలి రాజ’ రోజులలోని వెంకటేష్ ను మళ్ళి మారుతి ‘బాబు బంగారం’ లో చూపెట్ట బోతున్నాడా? అన్న కామెంట్స్ చేసుకున్నారు.   ఈ మధ్యకాలంలో యంగ్ హీరోల హవా విపరీతంగా పెరిగిపోయిన నేపధ్యంలో క్రేజ్  విషయంలో బాగా వెనక పడ్డ వెంకటేష్ ‘బాబు బంగారం’ ద్వారా తిరిగి తన సత్తా  చాటుతాడ  అనే విధంగా ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ ఉంది అన్న మాటలు వినిపించాయి. 

‘రన్ రాజా రన్’, ‘జిల్’ వంటి సినిమాలకు సంగీతం అందించిన జిబ్రాన్ సంగీతదర్శకత్వం  వహించిన  ‘బాబూ బంగారం’  ఆడియోలోని పాటలలో   కొంత క్లాసికల్ మరికొంత మార్క్ మ్యాజిక్ కనిపించింది. ముఖ్యంగా మల్లెల వానల అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ అయితే ఆల్బమ్ కే హైలైట్ అని అంటున్నారు. అదేవిధంగా ‘బాబూ బంగారం’ టైటిల్ సాంగ్ బాగున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

ప్రతి పాటలోనూ కొత్త వాయిద్యాలను వింటున్నట్లు సౌండ్ చాలా కొత్తగా ఉంది అన్న కామెంట్స్ కూడ చాలామంది చేసారు. మొత్తం పై ఎలా చూసినా ‘బాబు బంగారం’ ద్వారా వెంకీ తన పూర్వ సత్తా  చాటడం ఖాయం అనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: