స్టార్ హీరోలు ఈ మధ్య తమ నోరు అదుపులో పెట్టుకోకుండా మైకు దొరికితే ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేద్దామన్న ఆలోచనలో పడి కొద్దిపాటి ఇబ్బంది కరమైన డైలాగులను వదులుతున్నారన్నది టాక్. నిన్న జరిగిన బాబు బంగారం ఆడియో వేడుకలో విక్టరీ వెంకటేష్ కూడా టంగ్ స్లిప్ అయ్యి ఏం పీకలేదు అనేశాడు. ఇంతకీ వెంకీ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.


కెరియర్ స్టార్ట్ చేసి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న విక్టరీ వెంకటేష్ ఈ ముప్పై సంవత్సరాల కాలంలో తన సినిమాలతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే ఆడియో వేడుకలో వెంకటేష్ మాట్లాడుతున్నప్పుడు గోల చేస్తున్న ఫ్యాన్స్ తో మీరు అరవకండయ్యా మీరు అరిస్తే నేనేం మాట్లాడలేను.. అయినా ముప్పై ఏళ్లుగా స్టేజ్ ఎక్కి ఏమీ పీకలేదు ఇప్పుడేం పీకుతా అంటూ హాట్ హాట్ గా తన మీద తానే సెటైర్ వేసుకున్నాడు.


మారుతి దర్శకత్వంలో బాబు బంగరం అంటూ ఆగష్టు 12న రాబోతున్న వెంకటేష్ చూస్తుంటే తన మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఇక సురేష్ బాబు రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. సినిమా ఆడియో కూడా తనకు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుల సత్కారంతో నడిచింది. 


కొద్దికాలంగా వరుస సినిమాలివ్వడంలో విఫలమవుతున్న వెంకీ ఇక నుండి వెంట వెంట సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. చినబాబు రాధాకృష్ణలో వస్తున్న ఈ బాబు బంగారం సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. జిబ్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ ఆల్బం మొత్తం థ్రిల్లింగ్ మ్యూజిక్ తో అలరించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: