విలక్షణ కథలతో తనదైన స్టైల్ లో సినిమాలను తీసే దర్శకుడు ఇప్పుడు తను తీస్తున్న సినిమా విషయంలో ఎవరికి చెప్పుకోలేని ఇబ్బంది పడుతూ దాన్నేదో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మూడు భాషల్లో తెరకెక్కే సినిమాగా క్రేజ్ సంపాదించిన ఈ దర్శకుడు ఆ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ వల్ల తల పట్టుకుంటున్నాడట. ఇంతకీ ఎవరా దర్శకుడు అతన్ని అంతగా ఇబ్బంది పెడుతున్న హీరో ఎవరో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. 


ఐతే సినిమా నుండి సాహసం వరకు సినిమా సినిమాకు కొత్త ఆలోచనలో ప్రేక్షకులను ఊగిసలాడే ప్రయత్నం చేస్తున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి కథలను నమ్ముకుని సినిమా తీసే అతి తక్కువ దర్శకుల్లో ఒకరని చెప్పాలి. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మనమంతా సినిమా తీస్తున్న ఏలేటికి ఆ సినిమా హీరో సూపర్ స్టార్ మోహన్ లాల్ తో తెగ ఇబ్బంది పడుతున్నాడట.


ఏలేటి సినిమా కొత్తదనంతో ఉంటూనే కమర్షియల్ అంశాలు కనిపిస్తాయి. తీస్తున్న మనమంతా కూడా నలుగురి జీవితాల కథాంశంగా రాబోతుంది. అయితే తను చేసే ఏ భాషలోని సినిమా అయినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునే అలవాటుంది మోహన్ లాల్ కు. అయితే ఇప్పుడు అదే సినిమాకు పెద్ద మైనస్ అవుతుందట.


మనమంతా టీజర్, ట్రైలర్ చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. మోహన్ లాల్ పలికే డైలాగులు ఏంటా అని చెవులు నిక్కరించి విన్నా అర్ధం కాని పరిస్థితి కనబడుతుంది. అయితే ట్రైలర్ లోనే ఇలా ఉంటే సినిమా మొత్తం ఎలా ఉంటుందో అన్న కంగారు పట్టుకుంది ఆడియెన్స్ కు. ఏలేటి మోహన్ లాల్ తో మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో మోహన్ లాల్ వాయిస్ నే ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడట. మోహన్ లాల్ వాయిస్ థియేటర్ లో బాగానే ఉంటుందని అంటున్నాడు. ఆగషు 5న రిలీజ్ అవుతున్న మనమంతా సినిమా సాయి కొర్రపాటి నిర్మాణంలో వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: