సింగర్ సునీత పర్సనల్ లైఫ్ ఓ మిస్టీరియస్. ఆమె అందగత్తె కూడా కావడంతో అందరిలోనూ పర్సనల్ లైఫ్ గురించి క్యూరియాసిటీ. అందుకేనేమో..  ఆమెపై ఎన్నో రూమర్లు వచ్చాయి. ఓ రాజకీయ నాయకుడితో లింక్ ఉందని ఆ మధ్య సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగింది.

ఈ పుకార్లపై ఆమె తాజాగా స్పందించారు. ఆ వదంతలు ఎలా వచ్చాయో ఆమే వివరించారు. ఆ నాయకుడు కాంగ్రెస్ నేత మధుయాష్కీ. మధు యాష్కీగారితో  శత్రుత్వం ఉన్న కొందరు ఆయనపై వదంతులు పుట్టించారట.


ఓ బ్యూటిఫుల్ సింగర్‌తో ఆయనకేదో ఉందని వార్తలు రాయడం మొదలుపెట్టారట.  ఇండస్ట్రీలో ఉన్న బ్యూటిఫుల్ సింగర్స్‌లో సునీత కూడా ఒకతె కావడంతో చాలామంది సునీత అనుకుని ఆ వార్తను ప్రచారం చేశారట. అలా తనకు తెలియకుండానే తాను బలయ్యానంటోంది సునీత.

తన పక్కన ఓ స్ట్రాంగ్ పర్సన్ లేకపోవడం వల్లే ఇన్ని రూమర్స్ వచ్చాయని వాపోతోంది సునీత. భర్త ఎలా ఉన్నా సర్దుకుపోయి ఉంటే ‘సునీత గ్రేట్’ అని గొప్పగా మాట్లాడుకునేవారని.. లింకప్ రూమర్స్ కూడా వచ్చి ఉండేవి కావని అంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: