స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కు ఈ సంవత్సరం కలిసి వచ్చినంతగా మరే సంవత్సరం కలిసి రాలేదేమో అని అనిపిస్తోంది. టాప్ హీరోల సినిమాలు అన్నీ వరస పెట్టి పరాజయాలు పొందుతూ ఉంటే డివైడ్ టాక్ ను తెచ్చుకుని కూడ ‘సరైనోడు’ రికార్డులు సృష్టించింది. ఈ జోష్ వలన కాబోలు అల్లుఅర్జున్ ఒక ఇంటర్ నేషనల్ హాస్పిటాలిటీ కంపెనీతో భాగస్వామిగా మారి ఒక ఇంటర్ నేషనల్ క్లబ్ ను భాగ్యనగరంలో ప్రారంభిస్తున్నాడు. ఈ క్లబ్ నిర్మాణం ఇప్పటికే పూర్తి అయిన నేపధ్యంలో ఈ క్లబ్ ఈనెల 29న ప్రారంభం కాబోతోంది. 

ఈ క్లబ్ విశేషాలను వివరిస్తూ ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఒక ఆ శక్తిక్ర కథనాన్ని ప్రచురించింది. అంతర్జాతీయంగా పేరుపొందిన హాస్పిటాలిటీ కంపెనీ ‘యమ్ కిచేన్స్ అండ్ బఫెల్లో వైల్డ్ వింగ్స్’ పేరిట ఈక్లాబ్ ఏర్పాటు అవుతోంది.ఈ క్లబ్ లో విలాసవంతమైన సదుపాయాలతో పాటుగా నైట్ క్లబ్ కూడ ఉంటుంది. ఈ పత్రికకు ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో బన్నీ ఈ క్లబ్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక ఫ్యామిలీ క్లబ్ గా తీర్చి దిద్దబోతున్నాను అన్న విషయాన్ని వెల్లడించాడు. 

ఈ క్లబ్ లో అత్యంత విలాస వంతమైన సౌకర్యాలతో పాటుగా ఫ్రెంచ్ జర్మన్ చైనా థాయిలాండ్ సౌదీఅరేబియా దేశాల నుండి కుకింగ్ మాస్టర్స్ ను రప్పించి అనేక రకాల డిషస్ ను మెనూగా హైదరాబాదీలా కోసం తయారు చేయిస్తున్నట్లు బన్నె తెలియచేసాడు. ఈ నైట్ క్లబ్ లోని ప్రతి ఫ్లోర్ 10వేల ఎస్ఫటీతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్దిగాంచిన ఇంటీరియర్ డిజైన్స్ తో డిజైన్ చేయించ బడిందని బన్నీ చెపుతున్నాడు. 

ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోలలో  వివిధ రకరకాల వ్యాపారాలను నిర్వహిస్తూ నాగార్జున ముందు వరసలో ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా నాగార్జునకే షాక్ ఇస్తూ ఒక భారీ కార్పోరేట్ వ్యాపారాన్ని అల్లు అర్జున్ ప్రారంభించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఎరగని ఫారెన్ పార్టీ కల్చర్ ను పరిచయం చేస్తూ 2500 మంది సభ్యులకు పరిమితమైన బన్నీ ప్రారంభించబోతున్న కార్పోరేట్ నైట్ క్లబ్ ఈరోజు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: