ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తండ్రి, కొడుకులు వరుస పెట్టి సినిమాలు తీస్తూ ఇండస్ట్రీని ఓ ఊపుతున్నారు. వారే నాగార్జున, నాగచైతన్య, అఖిల్. ఈ అక్కినేని వంశం నుండి ఇండస్ట్రీకి మంచి బ్లాక్ బస్టర్స్ అందుతున్నాయి. కొడుకులు ఫాంలో ఉన్నప్పటికీ..నాగార్జున మాత్రం అంతకు మించిన సక్సెస్ ని ఇండస్ట్రీకి ఇస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే నాగార్జునే ఎక్కువ సక్సెస్ లని ఇస్తున్నాడు.


ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో నాగాచైతన్య తన అప్ కమింగ్ మూవీల విషయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటూ వస్తున్నారు. సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ వంటి మంచి చిత్రాలు ఇప్పుడు నాగచైతన్య చేతిలో ఉన్నాయి. ఆ తరువాత నాగచైతన్య, రానా తో కలిసి ఓ మూవీలో చేయనున్నాడనే విషయం తెలిసిందే.


అయితే ఇది నాగాచైతన్య తీసుకున్న సొంత నిర్ణయంగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాంబినేషన్ కి సంబంధించిన దానిపై ఇంకొంత మాట్లాడిన నాగార్జున...నాగచైతన్య తన కంటే మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ కాంబినేషన్ ని నేను అస్సలు ఊహించలేదు. కచ్ఛితంగా ఈ కాంబినేషన్ స్క్రీన్ పై హిట్ కాంబినేషన్ అవుతుందని చెప్పుకొచ్చారంట.


దీంతో త్వరలోనే నాగచైతన్య, రానా కాంబినేషన్ లో మూవీ రానున్నదనేది స్పష్టం అయింది. ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా స్పష్టం కాలేదు. నిర్మాతగా సురేష్ బాబు ఉంటున్నారు. మొత్తంగా నాగచైతన్య తన  అప్ కమింగ్ మూవీల విషయం ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ఇండస్ట్రీ టాక్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: