రచయిత సత్యానంద్ పేరు వినని వారు ఉండరు. తెలుగు సినిమా రంగంలో దాదాపు 4 దశాబ్దాల పాటు తిరుగులేని రచయితగా ఎందరో టాప్ హీరోలకు కథలు అందించిన ఘనత సత్యానంద్ సొంతం. నాగార్జున పవన్ కళ్యాణ్ మహేష్ బాబు తొలి సినిమాలకు స్క్రిప్ట్ వ్రాసింది సత్యానంద్ అన్న విషయం తెలిస్తే ఈ రచయిత ఏస్థాయిలో తెలుగు సినిమా రంగాన్ని ప్రభావితం చేసాడో అర్ధం అవుతుంది.

నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సత్యానంద్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ల గురించి అనేక ఆ శక్తికరమైన విషయాలను తెలియ చేసాడు. తాను చిరంజీవికి కథలు చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్ళే రోజులలో పవన్ కళ్యాణ్ చాల సైలెంట్ గా లోపల ఒక గదిలో లైట్ వేసుకుని ఎప్పుడూ ఎదో చదువుతూ లేదా ఆలోచిస్తూ కనిపించేవాడని అంటూ తాను చిన్నప్పుడు చూసిన పవన్ విషయాలను షేర్ చేసుకున్నాడు.

తరుచూ తన ఇంటికి వస్తూ తన లైబ్రరీలోని పుస్తకాలను అడిగి తీసుకు వెళ్ళడమే కాకుండా ఆపుస్తకాల గురించి ఎంతో లోతుగా తనతో చర్చించే పవన్ ను చూసినప్పుడు అతడు ఒక గొప్ప రచయిత కాని మేధావి కానీ అవుతాడు అని అనుకున్నానని అయితే అతడు పవర్ స్టార్ గా మారిపోతాడని అనుకోలేదు అంటూ కామెంట్స్ చేసాడు సత్యానంద్.

ఇక చిరంజీవి 150వ సినిమా గురించి మాట్లాడుతూ చిరంజీవి తనకు ఆ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా చూపెట్టారని చిరంజీవికి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు తాను సూచించిన విషయాన్ని బయట పెట్టాడు సత్యానంద్. అయితే చిరంజీవికి కథ వ్రాయడం అంటే చాల రిస్క్ అని అంటూ ముఖ్యంగా చిరంజీవి 150వ సినిమాకు స్క్రిప్ట్ అందించే రచయితలకు విపరీతమైన టెన్షన్ ఉంటుందని ఏ మాత్రం తేడా వచ్చినా ఆ సినిమా దర్శకుడితో పాటు రచయితను కూడ విపరీతంగా టార్గెట్ చేస్తారని అందువల్లనే చిరంజీవి తనను అడిగినా తాను కథ వ్రాయలేకపోయాను అంటూ చిరంజీవికి కథ వ్రాయడం అంటే ఎంత కత్తిమీద సామో అన్నది వివరంగా వివరించాడు సత్యానంద్..



మరింత సమాచారం తెలుసుకోండి: