హాట్ బ్యూటీ కాజల్ ఈమధ్య బెంగుళూరులోని ఒక షాపింగ్ మాల్ లో చేసిన ఎక్స్ పోజింగ్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. కాజల్ గ్లామర్ తగ్గిపోయింది అని కామెంట్స్ చేస్తున్న వారికి సమాధానంగా తన హాట్ లుక్ ను ప్రదర్శిస్తూ బెంగుళూర్ మాల్ లో హడావిడి చేసిందని వార్తలు వస్తున్నాయి.

లేటెస్ట్ గా కాజల్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు ఘోర పరాజయం చెందడంతో ఆమెపని అయిపోయింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ కామెంట్స్ కాజల్ వరకు వెళ్ళినట్లున్నాయి. అందుకే ఆమె రూట్ మార్చింది.  

ప్రస్తుతం కాజల్ తమిళంలో జీవా సరసన ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా పేరు ‘కావలై వేండన్’ ఈ సినిమా కోసం బెంగుళూరులోని ఒక ప్రముఖ మాల్ లో షూటింగ్ చేసారు. అక్కడ కాజల్ వైట్ డ్రస్సులో యిలా రెచ్చిపోయింది. కెమెరా స్టార్ట్ కానప్పుడు శాలువా కప్పుకొని కూర్చున్న కాజల్ షాట్ రెడీ అని దర్శకుడు అనగానే శాలువా తీసేసి ఇలా అక్కడ షూటింగ్ స్పాట్ లో ఉన్న వాళ్లకి మైండ్ బ్లాంక్ చేసిందని టాక్. ఇది ఇలా ఉండగా కాజల్ గత వారం చెన్నై నుండి వచ్చి చరణ్ ను ప్రత్యేకంగా కలిసి మాట్లాడినట్లుగా ఫిలింనగర్ లో వార్తల హడావిడి చేస్తున్నాయి. 

దీనితో చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి కాజల్ ఎంపిక ఇంచుమించు ఖరార్ అయినట్లే అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే శ్రీదేవి రికార్డును కాజల్ రిపీట్ చేస్తోంది అని అంటున్నారు. శ్రీదేవి అక్కినేని నాగేశ్వరరావుతో ‘ప్రేమాభిషేకం’ లో నటించి ఆ తరువాత నాగార్జునతో రొమాన్స్ చేసింది. అయితే ఇక్కడ కాజల్ రివర్స్ లో చరణ్ తో తన రొమాన్స్ మొదలు పెట్టి చిట్టా చివరకు చిరంజీవి యి హీరోయిన్ గా మారి టోటల్ మెగా హీరోయిన్ గా మారిపోయిన రికార్డు కాజల్ సొంతం అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: