బెల్జియంలో హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తూ ఒక బార్ ముందు సమంత రకుల్ ప్రీత్ రేజీనాలతో కలిసి సందడి చేస్తూ తీసుకున్న ఫోటోను సమంత తన అభిమానులతో షేర్ చేసుకుని షాక్ ఇచ్చింది. అయితే అక్కినేని కుటుంబ కోడలుగా త్వరలో నాగచైతన్యను పెళ్ళి చేసుకుని చైతూ భార్యగా సమంత కనిపిస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటే అందరికీ షాక్ ఇస్తూ ఇలా బెల్జియంలో తన గ్లామర్ ను ఒలకబోస్తూ తన అభిమానులకు షేర్ చేసిన ఫోటోలను చూసి నాగచైతన్య షాక్ అయినట్లు టాక్. 

త్వరలో తను పెళ్లి చేసుకుని లైఫ్‌‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్నానని, అచ్చు వంటింటి హౌస్‌వైఫ్‌లా ఇక మసలు కుంటానన్నట్టు ఫోటోలకు పోజులిచ్చిన సమంత ఇప్పుడు తన రూట్ మార్చి రకుల్ రెజీనాలతో కలిసి ఒక బారు ఎదుట ఇలా సందడి చేయడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

రెపో మాపో సమంత, చైతన్యల నిశ్చితార్థం డేట్‌ ఎనౌన్స్ అవుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటే తన అభిమానులను తికమక పెడుతూ సమంత ఇలాంటి ఫోజులు ఇచ్చింది ఏమిటి అని అంటూ చాలామంది షాక్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటివరకు ఎక్కడపడితే అక్కడ నాగచైతన్యతో సందడి చేసిన సమంత ఇప్పుడు ఇలా అందరి మైండ్ బ్లాంక్ చేస్తూ రకుల్ రేజీనీలతో పార్తీలు చేసుకోవడం ఏమిటి అని అక్కినేని కుటుంబ అభిమానులు కూడ బాధ పడుతున్నట్లు టాక్. 

దీనితో సమంత చైతూల పెళ్ళి విషయం కాస్త వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా నాగచైతన్య తన పెళ్ళికి- తన కెరీర్‌కు సంబంధించి అన్నివిషయాల్లో తన తండ్రి నాగార్జున డెసిసషనే ఫైనల్ అని తన సన్నిహితుల వద్ద కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: