గత నెల రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ చిత్రం ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఇక కబాలి విడుదల అయ్యే వరకు ఎన్నో కష్టాలు పడతూ వచ్చింది...ఈ చిత్రం వారం రోజుల ముందే నెట్ లో ప్రత్యక్షం కావడం తో నిర్మాత కన్నీరు పెట్టుకున్నారు. అయితే మద్రాస్ కోర్టు ని ఆశ్రయించగా పాజిటీవ్ రెస్పాన్స్ ఇవ్వడం ..కొన్ని సైట్లను మూసివేయడం తో ఆ గొడవ నుంచి బయట పడింది. ఇక 22 న భారీ అంచనాలతో విడుదలైన కబాలి చిత్రం వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేసింది. మొదటిరేజే రూ.108 కోట్ల గ్రాస్ (రూ.67 కోట్ల షేర్) కలెక్షన్లతో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది.  

ఫస్ట్ వీకెండ్ మొత్తంలో మరో చరిత్ర సృష్టించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం తొలి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్ల గ్రాస్, రూ.110 కోట్ల షేర్ వసూలు చేసింది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ ఫిల్మ్, తెలుగు రాష్ర్టాలు తప్పితే మిగతా అన్నిచోట్ల సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్టు ట్రేడ్ వర్గాల టాక్. ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్, వీకెండ్ కలిసి దాదాపు 210 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. ఒక్క తెలుగురాష్ట్రాల్లోనే కాదు.. అన్ని ఏరియాల్లోనూ తన ప్రభంజనంతో భారీ రికార్డులు నమోదు చేసుకుంది.

తమిళనాడులో రూ.45 కోట్ల గ్రాస్, కేరళలో రూ.9 కోట్లు, కర్ణాటకలో రూ.15 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.85 కోట్లు.. ఇలా రిలీజైన ప్రతి ఏరియాలో భారీ కలెక్షన్లతో ‘కబాలి’ వండర్స్ క్రియేట్ చేసింది.  ఈ చిత్రంతో రజినీ వన్ మాన్ షో చూపించారు..తన ఒకప్పటి రజినీకాంత్ స్టైల్ ప్రస్తుతం ఆయన ఏజ్ కి తగినట్లు నెరసిన గడ్డం హెయిర్ స్టైల్ తో వీక్షకులను కట్టి పడేశారు.  రజనీకి ఉన్న క్రేజ్, రిలీజ్‌కి ముందు ఎనలేని స్థాయిలో సినిమాను ప్రమోట్ చేయడం కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్ళు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఏరియా వైజ్ గా కబాలి కలెక్షన్లు కోట్లలో..


తమిళనాడు : 45 కోట్లు


కర్ణాటక : 15 కోట్లు


కేరళ : 9 కోట్లు


రెస్ట్ : 3 కోట్లు


ఓవర్సీస్ : 85 కోట్లు


ఏపీ +తెలంగాణ : 21 కోట్లు (రూ.15.5 కోట్లు షేర్)


టోటల్ కలెక్షన్లు : రూ.203 కోట్లు గ్రాస్ ( రూ.110 కోట్లు షేర్)



మరింత సమాచారం తెలుసుకోండి: