సినిమా ఇండస్ట్రీలో ఒక్క సారి చాన్స్ వస్తే చాలు లైఫ్ టర్నింగ్ అయినట్లే అని భావిస్తారు. అయితే సినిమాలో చాన్స్ వచ్చినా కెరీర్ లో ఏ మాత్రం బ్రేక్ రాక ఢీలా పడిపోయే నటీనటులు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు.  ఇండస్ట్రీలోకి చిన్న పాత్రలతో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ స్థాయికి ఎదిగిన నటీమణులు ఎంత గ్లామర్ ప్రదర్శించినా ఏ మాత్రం ప్రజాదరణ లభించదు. ఇలాంటి హీరోయిన్ల తర్వాత వ్యాంప్ పాత్రలు, ఐటమ్ సాంగ్స్ కి పరిమితం అవుతుంటారు. లేదా బుల్లితెరపై ఎంట్రీ ఇస్తుంటారు. మరి కొంత మంది హీరోయిన్లు తమ లగ్జీరీ జీవితాల కోసం పక్క దారులు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ''తకిట తకిట'' సినిమాతో ఇంట్రొడ్యూస్ అయిన బెంగుళూరు పిల్ల హరి ప్రియ గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది.

తెలుగులో అమ్మడు రొమాంటిక్ రోల్స్ తో దూసుకుపోతుందేమో అనుకుంటే.. ''పిల్ల జమిందార్'' హిట్టు తరువాత.. అమ్మడు ''అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్'' వంటి సినిమాల్లో ఏకంగా కాల్ గాళ్ గా నానా అందాలూ ఆరబోసింది. తెరపై ఎంత అందాలు ఆరబోసినా తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం ఎట్రాక్షన్ చేసుకోలేక పోయింది. దీంతో కన్నడంలో అయినా తనకు బ్రేక్ వస్తుందని అక్కడ  ఈ అమ్మడు  ''అత్తారింటికి దారేది'' సినిమా రీమేకులో ప్రణీత చేసిన పాత్రను చేసినప్పటికీ బ్రేక్ మాత్రం రాలేదు. ఆ తర్వాత ''నీర్ దోసె'' అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈ చిత్రం గత మూడు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుగుతూ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.

అయితే ఈ పాత్రలో హరిప్రియ విపరీతమైన అందాల ప్రదర్శన చేస్తుంది..దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి.  కాని సినిమా ఏమైందో మాత్రం తెలియట్లేదు.  అయితే ఈ చిత్రానికి ఇప్పటికే ముగ్గురు ప్రొడ్యూసర్లుమారడం ..మొత్తానికి ఆడియో ఫంక్షన్ జరిగే స్థాయికి వచ్చింది. మరి రిలీజ్ ఎప్పుడు చేస్తారో..హరిప్రియకు మళ్లి ఎప్పుడు కలిసి వస్తుందో వేచి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: