మెగాస్టార్ 150వ సినిమాకు దర్శకత్వ భాధ్యతను మీద వేసుకున్నాడు వినాయక్. అసలైతే వినాయక్ లాస్ట్ రిలీజ్ అఖిల్ అట్టర్ ఫ్లాప్ ఆ కారణాలను లెక్కేసుకుంటే వినాయక్ కు ఈ అవకాశం వచ్చేది కాదు. కాని ఇదవరకు తమిళ రమణను తెలుగు ఠాగూర్ గా వినాయక్ అదరగొట్టేశాడు. ఆ నమ్మకంతో వినాయక్ చేతే డైరక్షన్ చేయిస్తున్నారు మెగాస్టార్. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం చిరు సినిమా వినాయక్ డైరక్షన్ మాత్రమే చేస్తున్నాడట మిగతా విషయాలన్నిటిలో తన వేలే పెడుతున్నాడట మెగా పవర్ స్టార్ రాం చరణ్.


వినాయక్ కూడా చెర్రి చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడట. ఎందుకు రాం చరణ్ నిర్మాతని అలా చేస్తున్నాడా అంటే.. వినాయక్ తనకు తోచినట్టుగా సినిమా తీస్తే సినిమా తేడా కొడితే మొత్తం తప్పు తనమీద పడుతుంది. అఖిల్ సినిమాతో నేర్చుకున్న గుణపాఠం వల్ల వినాయక్ చిరు సినిమాకు కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తున్నాడట.


సినిమా టైటిల్, లొకేషన్స్, హీరోయిన్ ఇలా ప్రతి విషయంలో తన సలహా అడిగినా మీ ఇష్టం అనేస్తున్నాడట. ఇక వినాయక్ తీరు కనిపెట్టిన చెర్రి సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని ఇంకాస్తా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇప్పటికే మొన్నటిదాకా కత్తిలాంటోడు అంటూ ప్రచారం చేసిన సినిమాకు అది కాస్త కాదని నిన్నటి నుండి నెపోలియన్ అంటూ రచ్చ చేస్తున్నారు.


మరి అది కూడా అఫిషియల్ గా వచ్చిందేమి కాదు. చిరు సినిమా కోసం దర్శకత్వం పరంగా వినాయక్ కాన్సెంట్రేట్ చేస్తున్నాడట కాని సినిమాకు సంబందించిన మిగతా ఏ విషయంలోనూ తన జోక్యం లేకుండా చేసుకుంటున్నాడట. మరి వినాయక్ వ్యవహారం చూస్తుంటే మెగాస్టార్ మూవీని ఇష్టం లేకుండానే కానిచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ సినిమా మీద పడుతుందో లేదో చూద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: