టాలీవుడ్ లో ఈ మద్య డబ్బింగ్ చిత్రాల హవా నడుస్తుంది. టాలీవుడ్‌లో ఏటా 150-180 సినిమాలు విడుదలవుతుంటే.. దాదాపు అందులో సగానికి పైగా డబ్బింగ్ సినిమాలే వస్తున్నాయి. అయితే ఇక్కడ చిత్రాలు కూడా తమిళ, మళియాల భాషల్లో డబ్బింగ్ కావడం ఇక్కడ హీరోలు అక్కడ మంచి ఇమేజ్ సంపాదిస్తున్నారు. ఇలా చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో  టాలీవుడ్ లో ఈ మద్య రిలీజ్ అయిన చిత్రాలు మాత్రం యావరేజ్, మంచి టాక్ సంపాదించిన చిత్రాలే ఎక్కువ ఉన్నాయ.  తెలుగు హీరోలు కూడా ఇతర మార్కెట్‌లపై కన్నువేయడంతో తమిళంలో చాలామంది మంచి విజయాలే సాధిస్తున్నారు. మలయాళంలోనైతే అల్లు అర్జున్‌దే స్టార్‌డమ్. ప్రస్తుతం ఈ మార్కెట్‌పై మోహన్‌లాల్‌తో కలసి జూ.ఎన్టీఆర్ తన సత్తా చాటబోతున్నాడు.

ఇక బాలీవుడ్  లో కూడా తెలుగు సినిమాలు డబ్బింగ్ అవుతూ మంచి హిట్స్ సాధిస్తున్నాయి. ఆ మద్య జక్కన్న తీసిన ఈగ చిత్రం బాలీవుడ్ లో అనూహ్యంగా కలెక్షన్లు సాధించడంతో ఆశ్చర్య పోయిన రాజమౌళి తర్వాత బాహుబలి చిత్రం మాత్రం కరణ్‌జోహార్  అప్పగించారు. ఇప్పుడు బాహుబలి 2 కూడా ఆయనకే అప్పజెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  టెక్నికల్ వాల్యూస్, హయ్యస్ట్ రెమ్యూనరేషన్స్, కాస్ట్ఫా ప్రొడక్షన్ వంటి అనేక కారణాలతో చాలా చిత్ర నిర్మాణ సంస్థలు నిర్మాణానికి దూరమైపోయాయి. వీటన్నింటికి నేడు డబ్బింగ్ ఓ మంచి అవకాశంగా ఉంది. అందుకే వీరు సబ్జెక్ట్‌వున్న సినిమాలతోపాటు సబ్జెక్ట్‌లేని సినిమాలకు సైతం పబ్లిసిటీతో హోరెత్తిస్తున్నారు.

శ్రీ తిరుమల తిరుపతి శ్రీనివాసా సంస్థపై అనేక స్ట్రయిట్ సినిమాలు తీసిన చదలవాడ శ్రీనివాసరావు చాలాకాలం తర్వాత ‘బిచ్చగాడు’వంటి డబ్బింగ్ సినిమాతో మంచి హిట్‌నికొట్టి డబ్బింగ్ చిత్రాలపై ఆశను పెంచారు.  ఆ మద్య సూర్య 24 కూడా విపరీతమైన కలెక్షన్లు సాధించింది. వెరైటీ చిత్రాలు చేస్తాడనే పేరున్న ఉపేంద్ర నటించిన కన్నడ సూపర్ హిట్ సినిమా శివం, బ్రాహ్మణ పేరుతో తెలుగు లో మంచి విజయం సాధించింది. రజినీ కబాలి చిత్రం కూడా మంచి డివైడ్ టాక్ తో నడుస్తున్నా కలెక్షన్ల పరంగా దూసుకు పోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: