హిందీ సినిమా పరిశ్రమ కీ తెలుగు సినిమా పరిశ్రమ కీ మొదటి నుంచే లంకె బాగానే ఉంది. మనోళ్ళు హిందీ లో ఎప్పుడైనా సినిమాని డబ్బింగ్ చేసి వదులుతూ ఉంటారు, హిందీ వారు దాదాపు ప్రతి పెద్ద సినిమా ఇక్కడ డబ్బింగ్ చేస్తారు. బాహుబలి తరవాత లెక్కలు మారిపోయాయి, భారత దేశ చిత్ర పరిశ్రమ లో ఒక అద్భుతంగా నిలిచిన బాహుబలి చిత్రం తెలుగు సినిమా అంటే ఏంటో బాలీవుడ్ కి చూపించింది. హిందీ జనాలు నివ్వెరపోయే విధంగా ఈ సినిమా అక్కడ రికార్డులు సృష్టించింది.



బాహుబలి తరవాత తెలుగు లో హిందీ సినిమాల పరంపర ఇంకా పెరిగింది. ఎలాంటి సినిమా అయినా సరే పెద్ద హీరోలు అయిన సల్మాన్, షారూఖ్ ,ఆమిర్ ఖాన్ వీరు తెలుగు లో డబ్బింగ్ చేసి విడుదల చెయ్యడానికే ఇష్టపడుతున్నారు. సుల్తాన్ సినిమా ఇప్పటికే తెలుగు డబ్బింగ్ లేకపోయినా తెలుగు నాట హిందీ ప్రింట్ తో రాజ్యం ఏలుతోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తన కొత్త సినిమా రుస్తుం ని తెలుగు లో డబ్బింగ్  చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు . దీనికి సంబంధించి ప్రమోషన్ కోసం హైదరాబాద్ లో ఎక్కడికో రావడం కాకుండా ఏకంగా మన తెలుగు టాక్ షో లో దూరిపోయాడు అక్షయ్, ఈ సినిమా స్వతంత్ర దినోత్సవం రోజున విడుదల అవుతూ ఉండడం తో బుల్లి తెర ని వాడుకుని ప్రమోషన్ చెయ్యాలని చూస్తున్నుడు . ఈ సినిమా తరవాత మళ్ళీ మనం అక్షయ్ ని రోబో 2 లోనే చూడ బోతున్నాము. అందులో ఇతను విలన్ క్యారెక్టర్ చేస్తూ ఉండడం తో ఆ సినిమాకి కూడా ఇప్పటి నుంచే తెలుగు వారికి అక్షయ్ మొఖం పరిచయం అవడం ఎంతైనా అవసరం.




యాంకర్ ప్రదీప్ జీ తెలుగు లో చేసే కొంచెం టచ్ లో ఉంటె చెబుతాను షో కి మనోడు రాబోతున్నాడు. రాజమౌళి గ్యాంగ్ బాహుబలి కోసం ముంబై, డిల్లీ వెళ్లి షోస్ లో పాల్గొన్నట్టు తెలుగు లో మార్కెట్ కోసం అక్షి తిప్పలు పడుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: