యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా ‘బాద్ షా’. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై సినిమా వర్గాలకు, ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో వేసవిలో విడుదల కానున్న బాద్ షా సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి భారీ రేట్లతో బయ్యర్లు ముందుకువస్తున్నారు. తాజా వార్తల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా కు గాను బాద్ షా సినిమా హక్కులను 2.66 కోట్ల రూపాయిలకు విక్రయించారు. ఈ ప్రాంతానికి ఇంత భారీ ధర పలకడం టాలీవుడ్ చరిత్రలోనే రికార్డుగా చెపుతున్నారు. అలాగే గుంటూరు జిల్లాకు గాను 4 కోట్ల రూపాయిలు చెల్లించి బాద్ షా హక్కులను సొంతం చేసుకున్నారు. ఇది కూడా రికార్డు ధరగా భావిస్తున్నారు. ఇదే విధంగా మిగిలిన ప్రాంతాలకు కూడా భారీ ధరలు పలుకుతున్నాయి. ‘బాద్ షా’ విదేశీ హక్కులకు కూడా అత్యధిక ధరలతో బయ్యర్లు పోటీ పడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గత సినిమాలు విదేశాల్లో మంచి విజయాన్ని సాధించలేదు. అయితే శ్రీను వైట్ల పై ఉన్న నమ్మకంతో విదేశీ హక్కులు కోసం బయ్యర్లు ముందుకు వస్తున్నారు. ఇలాంటి సంఘటనలతో బాద్ షా బిజినెస్ ఇప్పటికే 50 కోట్ల రూపాయిలను దాటిందని తెలుస్తోంది. అయితే బాద్ షా నిర్మాత బండ్ల గణేష్ ఇంకా నష్టాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. బాద్ షా బడ్జెట్ ఇప్పటికే 55 కోట్ల రూపాయిలను దాటిందని, ఇంకా షూటింగ్, ఇతర కార్యక్రమాలు మిగిలిఉన్నందున బాద్ షా బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కారణంతో బాద్ షా బిజినెస్ 50 కోట్లను దాటినా బండ్ల గణేష్ నష్టాల్లోనే ఉన్నాడని చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: