పరభాషా సినిమాలు తెలుగులో డబ్బింగ్ చెయ్యడం , ఇక్కడి సినిమాలు వేరే భాషలో డబ్బింగ్ కి వెళ్ళడం అది సర్వ సాధారణ విషయం. తమిళం లో గానీ మలయాళం లో గానీ హిట్ అయిన ఏ సినిమా అయినా ఫీల్ అనేది పోకుండా మన ప్రేక్షకుల కోసం డబ్బింగ్ చేసి విడుదల చెయ్యడం అన్నది చాలా గొప్ప ప్రక్రియ. ఎవరో ఎక్కడో ఆలోచించిన ఒక థాట్ ని కథగా మలచి , సినిమాగా తీసినప్పుడు భాష అనేది ఒక అడ్డంకి కాకుండా ఇక్కడ ఉన్న మనం కూడా చూడగలిగే చాన్స్ ఇస్తుంది ఈ ప్రక్రియ.

 

కానీ కొందరు సినిమా పెద్దలు ఈ డబ్బింగ్ ప్రక్రియ కి నో చెబుతూ ఉంటారు. స్వయంగా సీనియర్ నిర్మాతలు, డైరెక్టర్ లూ ఒద్దు ఒద్దు అంటూ ఉండడం విశేషం. అనువాదాల మీద ఆసక్తి చూపే ప్రొడ్యూసర్ లు డబ్బింగ్ లు చెయ్యద్దు అంటూ ఉండడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం కాలం లో తెలుగు లోకి డబ్ అవుతున్న కొన్ని ఇతర భాషల సినిమాలు చూస్తూ ఉంటె ఇదెక్కడి గోడవరాబాబు అనిపిస్తోంది. పదేళ్ళ కిందట ఎప్పుడో విడుదల అయిన ఇతర భాష సినిమాలని డబ్బింగ్ చేస్తున్నారు మన మహానుభావులు.

 

ఆ భాషల్లో ఎవ్వరూ చూడని, అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు కూడా ఇక్కడ మన మొఖాన పడేస్తున్నారు. తమిళ హీరో ధనుష్ సినిమాలు, మలయాళం హీరో మోహన్ లాల్ సినిమాలు ఈ జాబితాలో ఎక్కువగా కనిపిస్తాయి. ధనుష్ జనీలియా జంటగా ఒచ్చిన ఒక సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు ఆ సినిమా ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల క్రితం నాటిది. మరొక మలయాళం సినిమా అందులో మమ్ముట్టి - కత్రిన కైఫ్ లు హీరో హీరోయిన్ లుగా చేసారు. ఈ సినిమా దాదాపు పదేళ్ళ క్రితం విడుదల అయ్యింది. ధనుష్ కి ఇక్కడ బాగా ఫేం ఉండడం తో దాన్ని అనువదిస్తుంటే మలయాళం సినిమాని కత్రిన కైఫ్ కోసం అనువాదం చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాల మీద ఎందఱో ప్రొడ్యూసర్ లు ఆధారపడి ఉన్నారు అని మళ్ళీ మళ్ళీ నిరూపిస్తున్నాయి ఇలాంటి సందర్భాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: