ప్ర‌పంచ దేశాల ఉన్న వివాహ చ‌ట్టాల‌కంటే మ‌న దేశం లో ఉన్న హిందూ వివాహ చ‌ట్టానికి ఎంతో గుర్తింపు ఉంది. 'ధ‌ర్మార్ధ  కామ మోక్షాల' నాలుగు పురుషార్ధాల‌లో ఒక‌టైన కామాన్ని ధ‌ర్మ బ‌ద్దం చేయ‌టానికి పెద్ద‌లు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం.ఇక్క‌డ మ‌న దేశ వివాహ సంప్ర‌దాయానికి ఇత‌ర దేశాలకు చాలా వ్య‌త్యాసం గ‌మ‌నిస్తాం. అక్క‌డ పెళ్లి చేసుకుని స‌హ‌జీవనం జ‌రిపి ఇష్టం లేక‌పోతే వెంట‌నే విడిపోవ‌చ్చు. కానీ మ‌న దేశంలో మాత్రం దీనికి భిన్నం. హిందూ వివాహ చ‌ట్టం 1955 ప్ర‌కారం ఒక్క‌సారి పెళ్లి చేసుకున్న అనంత‌రం ఏ కార‌ణం చేత‌నైనా విడిపోవాల‌నుకుంటే చ‌ట్ట ప్ర‌కారం విడిపోవాల్సిందే. లేక‌పోతే ఇరువురు శిక్షార్హులు గా ప‌రిగ‌ణిస్తారు.  ఈ విష‌యం అంద‌రికంటే సినీమా ఇండస్ట్రీలో ప‌నిచేసేవారికి ఎక్కువ‌గా తెలుసు. ఎందుకంటే దాదాపుగా పెళ్లి తంతూ, దానికి ఉన్న సంప్ర‌దాయాలు ఎక్కువ‌గా సినీమా ల ద్వారా నే ప్ర‌జలకు అవ‌గాహ‌న క‌ల్పిస్తారు.


అయితే ఇక్క‌డ ఏం జ‌రుగుతుదంటే ఎక్కువ‌శాతం సినీమా ఇండస్ట్రీలో ప‌నిచేస్తున్న అగ్ర‌హీరోలు, హీరోయిన్ లు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల పెళ్లిలు మ‌ద్య‌లోనే తెగిపోతున్నాయి. వీరి ప్రేమ పెళ్లి దాకా వ‌చ్చినా... ఆది మ‌ధ్య‌లోనే తెగ‌తెంపులు చేసుకుంటున్నారు. ఈ తంతూ ఇప్పుడ‌ని అప్పుడ‌ని చెప్ప‌లేం. తాజాగా అమ‌లా పాల్  విడాకుల వ్య‌వ‌హారం తెర‌పైకి రావ‌డంతో మ‌రోసారి సినీమా ఇండ‌స్ట్రీ ప్రేమ పెళ్లి, విడాకుల వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చింది. తార‌ల రీల్ లైప్ ప్రేమ‌ల‌తో పోలిస్తే రియ‌ల్ లైప్ ప్రేమ‌ల‌పైనే ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా  ఆస‌క్తిని క‌న‌బరుస్తుంటారు. వీరి సినీమా లో ఉన్న ట్వీస్టుల కంటే నిజ జీవితంలోనే ఎక్కు వ ట్వీస్టులు ఉంటున్నాయి. మూడు గంట‌ల సినిమా క‌థ‌ల్లానే తార‌ల నిజ జీవిత‌పు ప్రేమ బంధాలు ముణ్ణాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోతున్నాయి. నాటి అక్కినేని నాగార్జున నుంచి నేటి అమ‌ల‌పాల్- ద‌ర్శ‌కుడు విజ‌య్ వ‌ర‌కు ఇదే ప‌రిస్థితిని గ‌మ‌నిస్తాం. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఇండస్ట్రీలో చాలానే ఉన్నా కొంత మంది తారల స్టోరీల‌ను గ‌మ‌నిద్దాం.....

సుమంత్, కీర్తి రెడ్డిల విడాకులు 
 
అక్కినేని మేన‌ల్లుడైన సుమంత్ త‌న స‌హ‌చ‌ర నట్టి, తొలిప్రేమ ఫేం కీర్తిరెడ్డి ల వ్య‌వ‌హారం కాస్తా గ‌మ‌నిస్తే...  వీరిద్ద‌రు ఒక‌రినొక‌రు ప్రేమించుకున్నా పెద్ద‌మ‌న‌షుల ఒప్పంద‌తోనే వివాహం జ‌రిగింది. బొద్దుగా , సాంప్ర‌దాయంగా ఉండే కీర్తి రెడ్డి కి సినీమా ఇండ‌స్ట్రీలో అనుకున్నంత విజ‌యం సాధించ‌లేదు. ఇదే ప‌రిస్థితి సుమంత్ కు సైతం అనుభ‌వం ఉంది. ఒక‌టి రెండు సినీమా హిట్ అయినా ఆ త‌రువాత సుమంత్ సినీమాల‌కు ఆద‌ర‌ణ క‌రువైంది. దీంతో వీరిద్ద‌రు  పెద్ద‌ల స‌మ‌క్షంలో 2004 లో వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రికి ఒక కూతురు కూడా ఉంది. స‌రైన కార‌ణాలు తెలియ‌వు కానీ. ఈ జంట 2006 లో విడిపోయింది.  ఆ త‌రువాత కీర్తి రెడ్డి ఓ ఎన్ఆర్ఐ డాక్ట‌ర్ ని పెళ్లి చేసుకుని సినిమాల‌కు గుడ్ బై చెప్పేసింది. 

సినీ ప‌క్కిలో చిరు కూతురు శ్రీజ ప్రేమ వివాహం...

తెలుగు ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేసిన చిరంజీవి కూతురు శ్రీజ ప్రేమ వివాహం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక్క‌డ శ్రీజ న‌టి కాక‌పోయినా త‌న తండ్రి సినీమా ఇండస్ట్రీ చెందిన వాడు కాబ‌ట్టి చెప్ప‌క త‌ప్ప‌దు. వీరి ప్రేమ వివాహం సినీ ప‌క్కిలో జ‌రిగింది. అంత‌లోనే ముగిసింది కూడా. చిరు చిన్న‌కూతురు శ్రీజ, హైద‌రాబాద్ బేగం పేట్ లో ఉండే న్యాయ‌వాది రమణా మూర్తి కుమారుడు శీరిష్ భ‌రద్వాజ్ ను 2007 అక్టోబ‌ర్ 18న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిరంజీవిని కాద‌ని ఇంట్లోంచి వెళ్లిపోయిన శ్రీజ, శిరీష్ తో క‌లిసి అనేక వాహ‌నాలు మార్చి, చివ‌ర‌కు గోవాకు వెళ్లి  అక్క‌డి నుంచి ఢిల్లీకి చేరుకుని త‌మ‌కు ర‌క్ష‌ణ క‌లిపించాల‌ని ఢిల్లీ కోర్టులో కేసు వేశారు. ఇలా కొంత కాలం త‌రువాత వారు హైద‌రాబాద్ కు తిరిగి వ‌చ్చారు. బేగం పేట్ ప్రాంతంలోనే నాలుగేళ్ల‌పాటు కాపురం చేశారు. వీరికి రెండు సంవ‌త్స‌రాల పాప కూడా ఉంది. అయితే కార‌ణాలు తెలియ‌వు కానీ ఒక్క‌సారిగా  వీరిద్దరు విడిపోయారు. న్యాయ స్థానంలో వీరిద్ద‌రు విడాకులు తీసుకున్నారు. అనంతరం చిరంజీవి  త‌న స్నేహితుడి కుమారుడితో ఈ ఏడాది మార్చి 28 న వివాహం చేశారు. ఇక్కడ కూడా బ‌ల‌మైన కారణ‌మంటూ ఏమీలేదు.

ప‌వ‌న్ వివాహంలో ట్వీస్ట్ లే ఎక్కువ‌....

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివాహం సైతం మ‌ధ్య‌లోనే ముగింపు ప‌లికారు. అయ‌న మే 1997 లో నందిని తో వివాహం చేసుకున్నారు. అనంత‌రం వారు విడిపోయారు. ఆ పిమ్మ‌ట బ‌ద్రి సినీమాలో హీరోయిన్ గా ప‌నిచేసిన  లో రేణు దేశాయ్ తో స‌హ‌జీవనం చేశారు. అనంత‌రం వీరిద్ద‌రు 2009  లో వివాహం చేసుకోక త‌ప్ప‌లేదు.  వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.  అయితే కొన్ని రోజుల పాటు వీరి జీవ‌నం సాఫిగా సాగినా అంత‌లోనే వీడిపోయి వేరుగా ఉంటున్నారు. అయితే వీరిద్దరి మ‌ధ్య సైతం ఏలాంటి బేధాభిప్రాయం లేవ‌ని తెలుస్తోంది. అంత‌టితో ఆగ‌ని పవ‌న్, ర‌ష్యా న‌టి అన్నా లెజ్ నేవా ను 2013 లో వివాహం చేసుకున్నారు. హైద‌రాబాద్ లోని ఎర్ర‌గ‌డ్డ స‌బ్ రిజిస్టార్ ఆపీస్ లో విరిద్ద‌రి వివాహం జ‌రిగింది.

అమ‌లా పాల్- ద‌ర్శ‌కుడు విజ‌య్ ల విడాకులు ఖాయ‌మే

ప్రముఖ హీరోయిన్ , త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్ ని ప్రేమించి 2014 లో పెళ్లి చేసుకున్నారు, వివాహానంన‌త‌రం కూడా అమ‌లా పాల్ ప‌లు సీనిమాల్లో న‌టించారు. త‌న భ‌ర్త విజ‌య్ న‌టించ‌డానికి స్వేఛ్చా నిచ్చార‌ని కూడా ఆమె ప‌లుమార్లు ప్ర‌స్తావించారు.  అయితే కొంత కాలంగా వీరిద్ద‌రి మ‌ధ్య బేధాభిప్రాయాలు తలెత్తిన‌ట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రి విడిపోతున్నారని ప‌లు పత్రిక‌ల్లో వార్తలు వ‌స్తున్నాయి. ఇదే విష‌యాన్ని దర్శ‌కుడు కూడా స్ప‌ష్టం చేశారు. అమ‌లాపాల్ ,తాను విడిపోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు కానీ, కార‌ణాన్ని మాత్రం గొప్యంగా ఉంచారు. అయితే విరిద్దరి మ‌ద్య మాత్రం ఎదో బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని ఉహించ‌లేం. వాస్తవానికి సూర్య‌-జ్యోతిక త‌రువాత అంత క్యూట్ క‌పుల్స్  వీళ్లే న‌న్ని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఎవరూ విన‌కూడ‌ని వార్త వినాల్సి వ‌చ్చింది. ఇక ఇంత‌కు ముందు సినీ తార‌ల వివాహ వైపల్యాల‌ను ఇదే ప‌రిస్థితిని ఉంది. మ‌ల‌యాళ భామ న‌య‌న‌తార గ‌తంలో శింబు, ప్ర‌భుదేవాతో ఈ సుంద‌రి సాగించిన ప్రేమ వ్య‌వ‌హారం పెళ్లి పీఠ‌ల వ‌ర‌కు వెళ్లి ఆగిపోయింది.

శింబు, న‌య‌న‌తార ప్రేమ విఫ‌లం..

అప్ప‌ట్లో వ‌ల్ల‌న‌న్ చిత్రంలో శింబు తో క‌లిసి న‌టించింది న‌య‌న‌తార‌. ఈ సినిమా లో నటిస్తున్న సంద‌ర్భంలో శింబు తో న‌య‌న తార‌కు మొద‌లైంది పరిచయం అనంత‌రం ప్రేమ‌గా మారింది. ప‌లు వేడుక‌ల‌కు జంటగా హాజ‌రైన వీరి మధ్య సాన్నిహిత్యాన్ని దాచ‌లేదు. అయితే వీరి  పెళ్లికి దారి తీస్తున్న త‌రుణంలో న‌య‌న తార‌, శింబు  మ‌ధ్య వివాదాలు నెలకొన్నాయి. అయితే ఈ బ్రెక్ కు శింబు హ‌న్సిక తో  సన్నిహిత్యంగా ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని వార్తలూ వ‌చ్చాయి. అదే స‌మ‌యంలోనే ప్ర‌భుదేవా తో న‌య‌న తార మ‌ద్య స్నేహం మొద‌లైంది. అది కొద్ది రోజుల‌కు ప్రేమ‌గా మార‌డంతో ప్ర‌భుదేవాతో పెళ్లికి సిద్ద‌ప‌డింది. న‌య‌న‌తారను వివాహ చేసుకునేందుకు ప్ర‌భుదేవా త‌న స్వంత భార్య‌కు విడాకులు ఇచ్చారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతుంద‌నుకున్న వీరి ప్రేమ‌క‌థ‌కు అనూహ్య రీతిలో శుభం కార్డు ప‌డింది. అందుకు గ‌ల బ‌ల‌మైన కార‌ణం కూడా క‌న‌బ‌డుట లేదు.

సిద్దార్ద్, స‌మంతాల ప్రేమ వ్య‌వ‌హారం

ఇక తాజాగా నాగార్జున త‌న‌యుడు నాగ చైతన్య తో పెళ్లి కి రెడీ అవుతుంద‌ని వార్తలు వ‌స్తున్న మ‌రో హీరోయిన్ స‌మంతా సైతం గ‌తంలో ప్రేమాయ‌ణం కొన‌సాగించింది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన స్వ‌ల్ప కాలంలోనే అగ్ర‌క‌థ‌నాయిక‌గా ఎదిగారు. తెలుగు , త‌మిళ భాష‌ల్లో వ‌రుస అవ‌కాశాల‌తో జోరు మీద ఉన్న ఈ సుంద‌రి గతంలోనే సిద్దార్థ్ తో ర‌హ‌స్య ప్రేమాయ‌ణం సాగించింది. ఒకానొక‌ద‌శ‌లో వీరు పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు  కూడా ప్రచారం జ‌రిగింది. ఈ జంట మ‌ధ్య వ‌ల‌పు  బంధం ఉందని అంద‌రూ తేల్చేశారు. అయితే  ఈ ప్రేమ వ్య‌వ‌హారంపై సిద్దార్ద్ గానీ స‌మంతా గానీ పెద‌వి విప్ప‌లేదు. అయితే వీరి ప్రేమ పెళ్లి వ‌రకు వెళ్లి ఆగిపోయింది. ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు వ‌చ్చినట్లు దాంతో వీరిద్ద‌రు దూర‌మ‌య్యార‌ని వార్తలు వ‌చ్చాయి. తాజాగా నాగా చైత‌న్య తో చెట్ట ప‌ట్టాలేసుకుని తిరుగుతున్న‌ట్లు, త్వ‌ర‌లో వీరిద్దరి ఓ ఇంటివారు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

త్రిష‌, వ‌రుణ్ మ‌ణియ‌న్ నిశ్చితార్ధం..

కేరీర్ మొద‌లు పెట్టిన నాటి నుంచి ప్రేమ వ్య‌వ‌హారాలు వివాదాల కార‌ణాల‌తో తర‌చుగా వ‌ర్తాల్లో నిలుస్తున్న చైన్నై చిన్న‌ది త్రిష‌. గ‌తంలో రానా, సిద్దార్థ్ ల‌తో ఈ సన్నిహిత సంబంధాలు ఉన్న‌ట్లు వార్తలు వ‌చ్చినా... తాజాగా ఈ సుంద‌రి త‌మిళ నిర్మాత‌, వ్యాపార వేత్త వ‌రుణ్ మ‌ణియ‌న్ తో త్రిష నిశ్చితార్ధం జ‌రిగింది. ఇక పెళ్లి తంతు ముగియ‌డ‌మే త‌రువాయి అనుకుంట‌న్న త‌రుణంలోనే వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థలు నెల‌కొన్నాయి. ఈ వివాదం కార‌ణంగా వ‌రుణ్ బంధానికి త్రిష ముగింపు ప‌లికి నిశ్చితార్ధం ను ర‌ద్దు చేసుకుంది. పెళ్లి త‌రువాత త్రిష సినిమాల్లో కొన‌సాగ‌డానికి అత‌డు ఇష్ట‌ప‌డ‌లేద‌ని, ఆ కారణంగానే వీరి మ‌ధ్య  విభేదాలు చోటు చేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నా, వీడిపోయేంత బ‌ల‌మైన కార‌ణం లేద‌నే చెప్పాలి. క‌మ‌ల్ హ‌స‌న్, ప్ర‌కాష్ రాజ్, నాగార్జున‌, క‌ళ్యాణీ, సింగ‌ర్ సునీత‌, ఈగ సినీమా విల‌న్ సుదీప్  ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా పెరిగిపోతుంది.
 
మొత్తంమీద‌ సినీ తార‌లు  దేశ హిందూ వివాహ సంప్ర‌దాయ‌ల‌ను మంట గలుపుతున్నారు. అంతే కాదు వీరి విడిపోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణం లేక‌పోవ‌డం,  పాశ్చాత్య పోక‌డ‌ల‌కు బీజం వేస్తున్న సినీ తార‌ల విడాకుల భాగోతం మున్ముందు ఎన్ని చూడాలో ఏమో !


మరింత సమాచారం తెలుసుకోండి: