క‌బాలి సినిమా స్టోరిని ప‌క్క‌న పెడితే ఈ సినిమా హీరో ర‌జనీకాంత్ గురించి ప్ర‌స్తావిస్తే.... ర‌జ‌నీ ఆయ‌న తీసిన ఓ సినీమాను గ‌మ‌నిస్తే ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల గుండెల‌ను తాకేది మాత్రం డైలాగ్.  ఆయ‌న ఏ సినిమా లో న‌టించిన ఓ ప‌వ‌ర్ పుల్ డైలాగ్ ఉండాల్సిందే.  ఆ సిన‌మా లో డైలాగ్ సామాజిక విలువ‌ల‌ను కాపాడేలా ఉంటుంది.  ఇక‌ తాజాగా క‌బాలి సినిమాను గ‌మ‌నిస్తే... ""  ఆహ‌హ్హా తెలుగు చిత్రాల్లో ఇక్క‌డ గాటు పెట్టుకుని ... మీసాలు మిలితిప్పుకుని... లుంగీ క‌ట్టుకుని... పాత విల‌న్.. యే క‌బాలి.. అని పిల‌వ‌గానే... వొంగొని వినయంగా... ఎస్ బాస్.. అని నిల‌బడుతాడే ... ఆ క‌బాలి అనుకున్నార్రా...? ...... క‌బాలి రా....  ""    ఈ డైలాగ్ లో ఓ కొత్త రూపాన్ని గ‌మ‌నించాలి. ఎందుకంటే ఒక‌ప్పుడు విల‌న్ పాత్ర లో ఉన్నవారు వారిలో డైలాగ్ లో కొంతంగా విన‌యాన్ని ప్ర‌ద‌ర్శించేవారు. కానీ ఈ డైలాగ్ విల‌న్ లో ఓ కొత్త రూపాన్ని ఇచ్చారు డైర‌క్ట‌ర్ రంజిత్. ఈ డైలాగ్ లో పెద్ద షిలాస‌ఫియే దాగున్నది. దాని వెనుక ఉన్న క‌సి ఇంతా అంతా కాదు. ఒక్క‌సారి మ‌న‌స్పూర్తి గా ఆ డైలాగ్ ను గ‌మనిస్తే అర్ధమౌతుంది.   

త‌మిళ ద‌ళితుల ఆత్మ‌గౌర‌వ కోసం పోరాటమే క‌బాలి...

ఈ క‌థ విష‌యానికి వ‌స్తే.... ఈ సినిమా డైర‌క్ట‌ర్ చూయించింది సినిమాను కాదు... సినిమా పేరుమీద భార‌తదేశ సామాజిక విలువ‌ల వైరుద్యాన్ని చూయించాల‌నుకున్నార‌ని అర్దమైంది. అయితే ద‌ర్శ‌కుడుగా పా. రంజిత్ త‌ను చెప్ప‌ద‌లుచుకున్న అంశానికి ర‌జ‌నీకాంత్ లాంటి మ‌హా సూప‌ర్ స్టార్ ను ఎంచుకోవ‌డ‌మే అసలు ట్వీస్ట్. ఎంత‌టి సాహ‌సం రంజిత్ ది అనిపించ‌క త‌ప్పదు. తమిళుల ఆత్మ‌గౌర‌వం కోసం, ఇంకా పూర్తిస్థాయిలో చెప్పాలంటే... త‌మిళ ద‌ళితులు త‌మ ఆత్మ‌గౌర‌వం కోసం వారు చేసే పోరాటం దాని స్వ‌భావం ఎంత తీవ్రంగా ఉంటుందో మలేషియా కేంద్రంగా గ్లోబ‌లైజ్ చేయించి చూపించాడు ద‌ర్శ‌కుడు రంజీత్. అయితే ఇక్క‌డ ఓ విష‌యాన్ని గ‌మ‌నించాలి... ర‌జ‌నీకాంత్ ఈ  ఫిలాస‌ఫీ తెలిసే క‌బాలి పాత్ర‌ను ఒప్పుకున్నారా... లేక.. దర్శ‌కుడు ఆయ‌న‌కు ఏదో చెప్పి న‌మ్మించి న‌డిపించడా తెలియ‌దు కానీ, రజనీకాంత్ ను ఆకాశం నుంచి భూమ్మీద‌కు లాగిన రంజీత్ మ‌లేషియా లో ఉన్న ద‌ళిత కబాలిని ఓ హీరోను చేసినంత ప‌నిచేశారు. మొత్తంమీద ద‌ళిత ఆత్మ‌గౌర‌వాన్ని అంత‌ర్లీనంగా న‌ర్మ‌గ‌ర్భంగా చెప్పాల‌నుకున్నాడు. 

ప్రేక్ష‌కుల‌ను మోసం చేసిన ద‌ర్శ‌కుడు పా. రంజీత్

ర‌జీనికాంత్ ను మోసం చేసి క‌బాలి వేశం క‌ట్టిచ్చినట్టే. అంటే చూసే ప్రేక్ష‌కున్నీ మోసం చేసి సినిమా చూయించాల నుకున్నాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డే బాగుంద‌ని కొంద‌రు , బాగ‌లేద‌ని మ‌రికొంద‌రు ఇలా రెండు వ‌ర్గాలు బ‌లంగా విడిపోయారు ప్రేక్ష‌కులు. అయితే, ద‌ర్శ‌కుడు ఏమి  చెబుతున్నాడో అనే విషయాన్ని ప‌సిగ‌ట్ట‌గ‌లిగిన వారు సినిమా బాగుంద‌ని అంటున్నారు. ద‌ర్శ‌కుడిని ప‌సిగ‌ట్ట‌లేని వారు మ‌ద్య‌లోనే సినిమా వ‌దిలేసి పోయారు. ఎందుకీ వైరుధ్యం అనేదే క‌బాలి సినిమా కు చేయాల్సిన అస‌లైన విశ్లేష‌ణ‌. భార‌త దేశ తాత్వికత మీద మూల‌వాసీ బ‌తుకుల మీద వేల సంవ‌త్సరాల నుంచి భార‌త దేశంలో కొన‌సాగుతున్న కుల‌, ప్రాంత‌, జావి వివ‌క్ష‌ల మీద లొతైన అవగాహ‌న సంపూర్ణ ప‌రిజ్ఞానం ఉంటేనే ద‌ర్శ‌కుడు రంజీత్ ఏమీ  చెప్ప‌ద‌లుచుకున్నాడో అర్ధ‌మౌతుంది. కబాలిని ఒక మాములు సినిమా విశ్లేష‌ణ మాదిరిగా విశ్లేషించుకుంటూ పోతే అర్థ‌మ‌య్యే సినిమా కాదు. 

ద‌ర్శ‌కుడు ఎలా చెబితే ర‌జనీ కాంత్  అలా చేశారు...

నిజం చెప్పాలంటే... సాధ‌ర‌ణ ప‌ద్దతుల్లో విశ్లేషణ చేయ‌డానికి ఈ సినిమా ల దొరిక‌కే స‌రుకు ఏమీ ఉండ‌దు. ఫ్యాన్ త‌రుపు నుంచి చెప్పాలంటే.... ర‌జనీకాంత్ ఫ్యాన్స్ ప‌రువు తీసాడు ద‌ర్శ‌కుడు. ర‌జనీకాంత్ ఎందీ ఇలా తీయ‌డ‌మేంటీ వ‌రెస్టుగా, ద‌ర్శ‌కుడు ఎలా చెబితే అలా ర‌జ‌నీ త‌ల‌కాయ ఊపి న‌టించ‌డ‌మేంటీ అని గాయ‌ప‌డి ఉంటారు స‌గ‌టు అభిమాని. ఇక రజనీకాంత్ మాస్ హీరో కనుక ఆ మాస్ లో ద‌ళిత బ‌హుజన కులాల‌కు చెందిన అభిమానుల సంఖ్యే ఎక్కువ కావ‌డం వ‌ల్ల వారికి న‌చ్చే అవ‌కాశం ఉంది. పై కులాల‌కు చెందిన పాష్ క్లాస్ ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఈ సినిమా న‌చ్చే అవకాశాలు త‌క్కువ‌. అయితే న‌చ్చిన వారికి ఎందుకు న‌చ్చిదో వారికి అర్ధం కాక‌పోవ‌చ్చు. ఎందుకు న‌చిందో బ‌య‌ట‌కు చెప్ప‌లేక పోవ‌చ్చు.  క‌బాలి సినిమా ను చూసి ఇంటికి వ‌చ్చి, ప్ర‌శాంతంగా ప‌డుకుని ఆలోచిస్తే.. అప్పుడు లీల‌గా.. ఓహో ఇదా ద‌ర్శ‌కుడు చెప్ప‌ద‌లుచుకున్న‌ది అని అనిపిస్తుంది. అప్పుడు  పాత్ర‌లు వాటి యాక్స‌న్ గుర్తుకు వ‌చ్చి మ‌న‌సు క‌రిగి ఆనంద భాష్ఫాలు రాలుతాయి.  అపుడే ద‌ర్శ‌కుని క‌ళ్లతో సినిమా చూస్తాం.  

మ‌లేషియాలో త‌మిళుల వివ‌క్ష పై పోరాటమే ఈ సినిమా...

సామాజిక కోణాన్ని ఈ సినిమా ద్వారా ర‌జనీకాంత్ వంటి ప్రపంచ హీరో ను ముందు పెట్టి చూయించ‌డ‌మ‌నేది ద‌ర్శ‌కుని ప్ర‌తిభ‌కు అంకిత భావానికి నిద‌ర్శ‌నం. ఇక్క‌డ త‌మిళుల ఆత్మ‌గౌర‌వ పోరాటానికి తెలంగాణ ఆత్మ‌గౌర‌వ పోరాటానికి ద‌గ్గ‌రి పోలిక ఉంది. అయ‌తే ప‌ర‌స్ప‌ర విరుద్దంగా ఉన్న పోలిక‌. ఎలాగంటే... త‌మిళులు త‌మ రాష్ట్రం, దేశం వ‌దిలి ఎక్క‌డికి పోయినా వాల్లు త‌మిళ‌నాడును వెంటబెట్టుకుని పోతారు. శ్రీలంక లో ఉన్నా, మలేషియా లో ఉన్నా, ప్ర‌పంచంలో మ‌రెక్క‌డ ఉన్నా త‌మ ఆత్మ‌గౌర‌వం త‌మ హ‌క్కుల కోసం పోరాడే స్పృహ‌ను కోల్పోరు. కౌలాలంపూర్ కు ద‌శాబ్దాల కింద వ‌ల‌స వెళ్లిన తమిళులు మ‌లేషియా దేశ చ‌ట్టాల‌తో అక్క‌డి ప్ర‌జ‌ల‌తో ఎదుర్కొంటున్న వివ‌క్ష దాన్ని ఎదిరించే క్ర‌మంలో త‌మిళులు ప‌డే క‌ష్టాలు ఇతివృత్తంగా సాగిన సినీమాలో మాఫియా కింగ్స్ గా ఎద‌గ‌డంలో ఉన్న ఆత్మ‌గౌర‌వ  ఆకాంక్ష మీద ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు ఫోక‌స్ చేసిన తీరు దేశీయ వెండితెర పై ఓ కొత్త కోణాన్ని అదించింద‌ని చెప్ప‌వ‌చ్చు. 

గాంధీ, ఆంబేద్క‌ర్ ల డ్రెస్ కోడ్ పై సంచ‌ల‌న డైలాగ్...
 
ఓ సంద‌ర్భంలో ర‌జనీకాంత్ డైలాగ్ ను  గ‌మ‌నిస్తే... గాంధీ బ‌ట్ట‌లు విప్పదీయ‌డానికి అంబేద్క‌ర్ సూటు వేసుకోవడానికి పెద్ద రాజ‌కీయ కార‌ణాలే ఉన్నాయి. అది నిజం.  ఈ డైలాగ్ వెనుక పెద్ద ఫిలాస‌ఫీ ఉంది. అంత పెద్ద ఫిలాస‌పీ ఉంటే గానీ ఈ డైలాగ్ అర్ధం కాదు. ఈ జ్యోతి రావ్ పూలే ను భార్య సావిత్రి భాయ్ పూలే ఎలా చూసుకుంటుందో... ర‌జనీకాంత్ ను ఆయ‌న భార్య కుంద‌న‌వ‌ల్లి కూడా త‌న  భర్త‌ను అంత గ‌ర్వంగా చూసుకుంటుంది. మాఫీయా డాన్ కు జ్యోతీ రావ్ పూలే కు పోలికేంటని మీకు అనుమానం రావ‌చ్చు.  కానీ ద‌ర్శ‌కుడు ఆ పాత్ర‌ను సృష్టించి చూయించద‌ల‌చుకున్న‌దే అది. అయితే త‌ను కబాలి ద్వారా అంబేద్క‌ర్ డ్రెస్ కోడ్ గురించి చ‌ర్చకు తెర లేపారు. ద‌ళిత బ‌హుజనులు సూట్ బూట్ ఎందుకేసుకోవాలో ఈ హిందూ దేశంలో స్ప‌ష్టంగా చెప్పాడు అంబేద్క‌ర్. అదే స్పూర్తి గా ఓ ఫైటింగ్ సీన్ లో ర‌జనీ కాంత్ బ‌ట్ట‌లు ఉడ‌దీయ‌డానికే ప్రాదాన్య‌త నిస్తాడు విల‌న్. ఆ సంద‌ర్భంగా బ‌ట్ట‌ల‌కు ఏమీ కాకుండా హీరో ప‌డ్డ సంఘ‌ర్ష‌ణ వెనుక అంబేద్క‌ర్ ఫిలాస‌పీ ఉంది.  

ఆక‌ట్టుకున్న ర‌జ‌నీ, రాధికా ఆప్టే...

మొత్తంగా క‌బాలి సినిమా అంటే జనానికి జ్ఙానాన్ని పంచే మాధ్య‌మంగా భావించి, తీసిన ద‌ర్శ‌కుడు పా. రంజిత్ కు నిర్మాత కు, ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎటువంటి అభూత క‌ల్ప‌న‌లు లేని పాత్ర‌యే ప్ర‌ధాన‌మ‌ని న‌మ్మి క‌బాలి గా న‌టించి క‌న్నీళ్లు పెట్టించిన హీరో ర‌జ‌నీకాంత్, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న రాధికా ఆప్టే కు అభినందిచాల్సి న అవ‌సరం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: