ఏక‌పాత్రాభిన‌యం అన‌గానే మ‌న‌కు గుర్తు కొచ్చేది తెర‌పై న‌టుడు, లేక న‌టి వ‌చ్చి త‌న ఆట మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆల‌రించ‌డం. ఇక వెండి తెర‌పై ఏక‌పాత్రాభిన‌యం పై అంత‌గా ప్రాదాన్య‌త ఇవ్వ‌లేదు. కానీ క‌థ‌ను మాత్రం ఒకరి పైనే రాసి, కెమెరాను ప‌రిమితం చేశారు. ఇలా  లేడిస్ ఓరియంటెడ్ , జెన్స్ ఓరియంటెడ్ సినిమా లు వ‌చ్చాయి. ఇందులో ఎక్కువ శాతం లేడీస్ ఓరియంటెడ్ చిత్రాలే హిట్ అయ్యాయి. ఇకపోతే... చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సర్వ‌సాధారణంగా అంద‌రూ చెప్పేది.... లింగ వివ‌క్ష స‌మ‌స్య‌. సెట్ లో ప‌నిలో, వేత‌నాల్లో వివ‌క్ష మాటెలా ఉన్నా... సినిమా  స‌క్సెస్ కు స్క్కిప్ట్ లో మ‌హిళా పాత్ర‌ల‌కు ప్రాధాన్యం కీల‌క‌మ‌ని ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కూ బాగా తెలుసు. ఆప్ కోర్స్ దాదాపుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలో సక్సెస్ నే చూశాయి. నాటి సావిత్రి, జ‌మునా త‌రం నుంచి జ‌య‌ప్ర‌ధ వ‌ర‌కు చాలా మంది హీరోయిన్లు మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల్లో మెప్పించారు. మొన్న‌టి  త‌రం బామ‌లు విజ‌య‌శాంతి, సౌంద‌ర్య బాక్సాఫీస్ బ‌ద్ద‌లు గొట్టారు. అంతులేని క‌థ‌, క‌ర్త‌వ్యం లాంటి ఎన్నో సినిమాలు అందుకు ఉదాహ‌ర‌ణ గా చెప్పుకొవ‌చ్చు.

అరుంధ‌తి నుంచి సైజ్ జీరో దాకా...

ఇక తాజాగా మేము సైతం ఏం త‌క్కువ తిన్నా అని భావించారో లేక చిత్ర సీమ‌లో ఉన్న లింగ వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా మ‌రో ఉద్యమం చేయాల‌ని భావించారో తెలియ‌దు కానీ... చాలా మంది అగ్ర‌హీరోలు లేడీ ఓరియంటెడ్ సినిమాల‌కు రెడీ అయిపోతున్నారు.  వీరి చిట్టా రోజు కింత పెరిగిపోతుంది. ఈ జాబితా లో ఎంత మంది ఉన్నారో ఒక్క‌సారి గ‌మ‌నిస్తే.... అనుష్క నేటి సినిమాల్లో హీరోల‌కు మించిన హీరోయిన్ గా పేరున బెంగుళూర్ భామ‌. గ్లామ‌ర్ హీరోయిన్ గా  మొద‌లై... ఆ పాత్ర‌లే చేస్తూ వ‌స్తున్న ఈ యోగా టీచ‌ర్ కెరీర్ కు పెద్ద ట‌ర్నింగ్ పాయింట్ అరుంధ‌తి. లేడీ ఓరియంటెడ్ సినిమాగా అరుంధ‌తి తెలుగులోనే కాదు... తమిళంలోని ఆడియ‌న్స్ క్లాప్స్  ప‌డ్డాయి. బాక్సాఫీస్ వ‌ద్ద కాసులు వ‌ర్షం కురిసింది. అప్ప‌టికే సౌంద‌ర్య మ‌ర‌ణంతో కొత్త చిరునామా వెతుక్కుంటున్న హీరోయిన్  ఓరియంటెడ్ సినిమాల‌కు కొత్త కేరాఫ్ అడ్ర‌స్ అనుష్క అయ్యారు. అప్ప‌టి నుంచి పంచాక్ష‌రీ, తాజాగా రుద్రమ‌దేవి, సైజ్ జీరో దాకా క‌థ మొత్తం హీరోయిన్ చ‌ట్టూ తిరుగుతుందంటే అనుష్క కాల్షిట్ల‌కు య‌మ డిమాండేనే చెప్పాలి.  తాజాగా ఈ సుంద‌రి అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో త‌యారవుతున్న భాగ‌మ‌తి సినిమా న‌టించ‌బోతుంది. ఈ సినిమా క‌థ అంతా హీరోయిన్  పాత్ర చుట్టూనే తిరుగుతుందట‌. 

అనామిక గా న‌య‌న‌తార లేడీ ఓరియంటెడ్ మూవీ...

సినిమా సినిమాకీ  గ్లామ‌ర‌స్ గా క‌నిపించాల‌ని హీరోయిన్లు అనుకోవ‌డం స‌హ‌జం.అందుకే  ఎప్ప‌టిక‌ప్పుడు మేకోవ‌ర్ అవుతూ ఉంటారు. అయితే ఈ రేంజ్ లో కూడా మేకోవ‌ర్ కాగ‌ల‌రా?  అని చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయేలా చేసిన న‌టి న‌య‌న తార‌. చంద్ర‌ముఖి లో న‌టించిన న‌య‌న‌తారేనా ఈవిడ అని బాస్ సినిమా చూసినవాళ్లు అనుకున్నారు. ఆ సినిమా నుంచి  ఈ మ‌ధ్య విడుద‌లైన హిందీ క‌హానీ కి దక్షిణాది రీమేక్ అనామిక వ‌ర‌కూ న‌య‌న‌తార మేకోవ‌ర్ అవుతూ వ‌చ్చారు. ఇటు తెలుగు అటు త‌మిళం లో తిరుగులేని తార అనిపించేసుకున్నారు. చివ‌రకు లేడీ ఓరియంటేడ్ మూవీ కి రెడీ అన్నారు. క‌మ‌ర్సియ‌ల్  స‌క్సెస్  మాట ఎలా ఉన్నా.... హిందీ ఒరిజిన‌ల్ లో విద్యాబాల‌న్ లాగా తెలుగు లోల రీమేక్ శేఖ‌ర్ క‌మ్ముల అనామిక లో టైటిల్ రోల్  కి న్యాయం చేశారు న‌య‌న‌తార‌. ఆ త‌రువాత మాయ  అనే ప్ర‌ధాన‌మైన హ‌ర్ర‌ర్ మూవీలో న‌టించారు. ఆ సినిమా హిట్ తో ఈ కేరళ కుట్టి కోసం చాలా మంది ద‌ర్శ‌కులు హీరోయిన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నారు. ఇప్ప‌టికే మాయ సినిమాను చేస్తున్న న‌య‌న కోసం ద‌ర్శ‌కుడు దాస్ రామ‌సామి ఓ హార్ర‌ర్ క‌థ ను రెడీ చేసుకున్నారు. త‌మిళంలో  దొర పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం లో కొన్ని సీన్స్ లో న‌య‌న‌తార  చాలా మాస్ గా క‌నిపిస్తార‌ట‌...

త్రిషా కృష్ణ‌న్ క‌ళావ‌తి గా కొత్త కోణాన్ని చూపించారు...

తెలుగు సినీమా రంగంలోకి వచ్చి పుష్క‌రం దాటినా... నాటి నుంచి ఇప్ప‌టికీ ఒకేలా  క‌నిపించ‌డం త‌మిళ పొన్ను త్రిషా కృష్ణన్ స్పెషాలిటీ. వ‌య‌సు పెర‌గ‌డం కొన్నేళ్ళ క్రిత‌మే ఆగిపోయింద‌నిపించే ఈ హీరోయిన్ కు ప్రేమ‌క‌థలు, గ్లామ‌ర్ పాత్ర‌లు పెట్టింది పేరు. జుట్టు ఉన్న‌మ్ము ఏ కొప్పు ముడిచినా అంద‌మే అన్న‌ట్లు , ఇటీవ‌ల హీరోయిన్ ఓరియంటెడ్ పాత్ర‌లోస్తుంటే సై అంటున్నారు. గ‌తేడాది త‌మిళంలో వ‌చ్చిన హ‌ర్ర‌ర్ చిత్రం అర‌న్మ‌ణై-2 ( తెలుగు లో క‌ళావ‌తి) , గ‌త నెల రిలీజైన తెలుగు- తమిళ ద్వి భాషా హార్ర‌ర్ - కామెడీ నాయ‌కీ త్రిష‌లోని కొత్త కోణాన్ని ప‌రిచయం చేశాయి. ఇదే అదునుగా భావించిన త్రిష ఓరియంటెడ్ మూవీ ల బాట పట్టారు. రెండేళ్ల క్రితం ముగ్గురు హీరోయిన్లలో ఒక‌రిగా త‌మిళంలో ర‌మ్ ( రంభ‌, ఊర్వసీ, మేన‌కా) అనే సినిమాకు సై అన్నా , అది అర్ధాతరంగానే ఆగిపోయింది. ఇక మ‌రో త‌మిళ  హార్రర్ సినిమా మోహిని లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఆర్. మాధేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అచ్చ తెలుగు మ‌హిళా చిత్రంగా త‌మన్నా అభినేత్రి 

తెలుగు సినిమా రంగంలో ప‌రిచ‌య‌మై... తమిళం, హిందీ సినిమాల్లో కూడా జెండా ఎగ‌రేసింది పంజాబీ పిల్ల గ్లామ‌ర్ బుల్లి త‌మన్నా. తెలుగులో మాట్లాడ‌క‌పోయినా పాత్ర త‌ప్ప‌నిస‌రి అంటే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకునే ద‌శ‌కు వ‌చ్చేశారు. బెస్ట్ డ్యాన్స‌ర్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ భాటియా వంశ‌పు యువ‌రాణి ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాల‌కు కూడా ఎస్ అంటున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు ఎల్. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో  వ‌స్తున్న అభినేత్రి సినిమాలో అచ్చంగా మహిళా ప్ర‌ధాన చిత్ర‌మే. నేత  చీర క‌ట్టుకుని , న‌దుట‌న బొట్టు , మెడలో పువ్వులు పెట్టుకుని పాత కాలానికి చెందిన అమ్మాయిలా , మ‌రోప‌క్క అధునాత‌న‌మైన దుస్తుల్లో న‌వ నాగ‌రిక యువ‌తి గా రెండు షెడ్స్ ఉన్న పాత్ర‌ల్లో త‌మన్నా న‌టిస్తోంది. భారీ ఎత్తున రూపొందుతున్న ఈ త్రి భాషా చిత్రం గ‌న‌క హిట్టైతే మ‌రో హీరోయిన్ మ‌న‌కు దొరికేసిన‌ట్టే న‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క, నిర్మాత‌లు.

మంచు ల‌క్ష్మీ లో కొత్త ద‌నం కొరుకునే హీరోయిన్...

సినిమా కుటుంబంలో పుట్టి, ఆ వాతావ‌ర‌ణంలో పెరిగిన మంచు వారి అమ్మాయికి జీవితం లోనూ...సినీ జీవితంలోనూ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ద‌నం కోరుకునే హీరోయిన్ మంచు లక్ష్మి. ఆమె ప్ర‌యాణ‌మే అందుకు సాక్ష్యం. హాలీవుడ్ లో టీవీ షో ల‌తో మొద‌లు పెట్టి తెలుగు సినీమాలో టీవీ షో ల వ‌ర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ద‌నంతో ముందుకు పోయే కేరీర్ ఆమెది. తొలి చిత్రం అన‌గ‌న‌గా ఒక ధీరుడు లో ప్ర‌తినాయకి ఐరేంద్రి పాత్ర‌తోనే అంద‌రినీ ఆక‌ట్టుకున్న ఘ‌న‌త ల‌క్ష్మి సొంతం. ఇప్ప‌టికే చంద‌మామ క‌థలు, బుడుగు, దొంగాట చిత్రాల్లో విభిన్న త‌ర‌హా పాత్ర‌లు పోషించారు. మంచు ల‌క్ష్మి. తాజాగా ల‌క్ష్మి బాంబ్ అనే విభిన్న త‌ర‌హా చిత్రంలో క‌నిపిస్తున్నారు. హిందీ, ఇత‌ర భాష‌ల్లో లేడీ ఓరియండెట్ చిత్రాలు బాగా మార్కెట్ చేస్తున్నాయి. తెలుగు లోనూ అలాంటి మార్కెట్ రావాల‌ని  చేస్తున్న చిత్ర‌మిది అని ల‌క్ష్మి 
వ్యాఖ్యానించారు.

కొనసీమ ముద్ద‌గుమ్మ అంజ‌లి సైతం సై....

తెలుగులో షాపింగ్ మాల్, జ‌ర్నీ, సీత్తమ్మ వాకిట్టో సిరిమ‌ల్లె చెట్టు సినిమాల గురించి విన‌గానే మ‌నకు గుర్తుకొచ్చే హీరోయిన్ ఎవ‌రో తెలుసా? అదే నండీ కొన‌సీమ అమ్మాయి అంజ‌లి. డీ-గ్లామ‌ర్ పాత్ర‌లైనా.. త‌న చుట్టూ తిరిగే క‌థ‌ల‌కు ప్రాణం పోసింది అంజ‌లి. రెండేళ్ల క్రితం వ‌చ్చిన హిట్ హార్ర‌ర‌ర్  కామెడీ గీతాంజ‌లి లాంటివి తెలుగులోనూ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ కు అంజ‌లిని కొత్త ఛాయిస్ గా మార్చాయి. ఆ త‌రువాత ఆమె దగ్గ‌రికి ఎన్ని స్త్రీ  ప్ర‌ధాన చిత్రాల స్క్రిప్ట్ లు వచ్చాయంటే చివ‌రికి చాలా సినిమా ల‌కు అంజ‌లి నో చెప్పాల్సి వచ్చింది. ఇక‌పోతే తెలుగులో త‌యారవుతున్న తాజా సైకో-యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రాంగద ( యార్ నీ) హీరోయిన్ అంజ‌లి యే. ఆశోక్ ద‌ర్శ‌క‌త్వంలో చాలా కాలంగా చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే త‌మిళంలో మ‌రో లేడీ ఓరియంటెడ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం కాన్బ‌దు పోయ్ ( చూసేదంతా అబ‌ద్దం) న‌టించ‌డానికి కూడా అంజ‌లి సంత‌కం చేసేసింది. వాస్త‌వానికి ఇత‌ర భాషల్లో లేడీ ఓరియండెట్ చిత్రాలకు ఆద‌ర‌ణ ఎక్కువే.  ఇదే మార్కెట్ తెలుగు, త‌మిళ సినీమా ఇండస్ట్రీల్లో రావాలే కానీ హీరో లేని సినీమాలు పెర‌గ‌డం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: